ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
జనవిజయం, జూన్ 07(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) :
ఈ రోజే ఉదయం పుట్టపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు,పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల రెండు మృత దేహాలను, ఆయుధాలను( ఎస్ ఎల్ ఆర్ సిగ్నల్ పూరి 1),పేలుడు సామాగ్రిని ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.మృతి చెందిన ఇద్దరిలో ఒకరు మడకం ఎర్రయ్య రాజేష్,చర్ల ఎల్ ఓ ఎస్ కమాండర్ గా గుర్తించడం జరిగింది.రెండవ మృతుని వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.ఈ రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడమైనది.