జనవిజయంఉపాధిలాప్స్ అయిన ఎంప్లాయ్ మెంట్ కార్డులు పునరుద్దరణకు డిసెంబర్ 31 వరకూ అవకాశం

లాప్స్ అయిన ఎంప్లాయ్ మెంట్ కార్డులు పునరుద్దరణకు డిసెంబర్ 31 వరకూ అవకాశం

ఖమ్మం, మే24(జనవిజయం): ఇది వరకే ఎంప్లాయిమెంట్ కార్డ్ పొంది వివిధ కారణముల వలన రెన్యూవల్ చేసుకోలేక పోయిన అభ్యర్థులు తమ ఎంప్లాయిమెంట్ కార్డ్ లను రెన్యువల్ చేసుకోవడానికి 31.12.2021 వరకు అవకాశం కల్పించినట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ సోమవారంనాడొక ప్రకటనలో తెలిపారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వము G.O.R&No.249 కార్మిక ఉపాధి మరియు శిక్షణ శాఖా Dt.10.05.2021 ద్వారా 45సం.లోపు ఉన్న అభ్యర్థులకు రెన్యువల్ చేసుకోవడానికి ప్రభుత్వము అవకాశము కల్పించబడినది. 45సం.లోపు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాలని కోరారు. రెన్యువల్ చేసుకోవడానికి ఒరిజినల్ ఎంప్లాయిమెంట్ కార్డ్, కులము, ఆదార్ లతో పాటు విద్యార్దుల ఒరిజినల్ సర్టిఫికేట్, https//:employment.telangana.gov.in ద్వారా ఎంప్లాయిమెంట్ పోర్టల్ లో రెన్యువల్ రిస్టోరేషన్ ఆప్షన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశం ఈ సంవత్సరం చివరి వరకూ అనగా 31.12.2021 వరకు ఉంటుందన్నారు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎంప్లాయిమెంట్ కార్ట్ లాప్స్ అయిన అబ్యర్ధి యొక్క పూర్తి వివరాలు (DATA) ఆన్ లైన్ లో ఉంటే అటువంటి వారు సర్టిఫికేట్ జత (SCAN) చేయనవసరం లేదన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా ఉపాధి అదికారి , ఖమ్మం సెల్ నం 9849557187 లో సంప్రదించ్చని శ్రీరామ్ తెలిపారు.

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి