బోనకల్, ఆగష్టు 7 (జనవిజయం) : ఎక్కడెక్కడో తిరిగేవాడు ఎం.ఎల్.ఏగా అవసరమా? అని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు వ్యాఖ్యానించారు. మధిర ఎం.ఎల్.ఏ భట్టి విక్రమార్క నుద్దేశించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. బోనకల్ మండలం చొప్పకట్లపాలెంలో ఆదివారం నాడు షుమారు 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు, డ్రైన్ ల నిర్మాణ పనులకు కమల్ రాజు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలు కమల్ రాజుకు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రామంలో జరిగిన బహిరంగ సభకు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు వడ్డే నరేష్ అధ్యక్షత వహించారు. ఈ సభలో లింగాల కమల్ రాజు మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించమని తనను అడుతున్నారని, తన శక్తి మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గం ఎం.ఎల్.ఏ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వల్లనే ప్రజలు తనను కలుస్తున్నారని తెలిపారు. భట్టి విక్రమార్క ఈ నియోజకవర్గం కోసం ఏమీ చేయడం లేదన్నారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు తప్ప ప్రజలకోసం ఆయన ఏమీ చేయడని, ఆలోచించడని అన్నారు. ముఖ్యమంత్రి కేసీయార్ దూరదృష్టితో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధికోసం కృషి చేస్తున్నారన్నారు. దళిత బంధు వంటి పథకాలు ముఖ్యమంత్రి ఆలోచనవల్లనే చింతకాని మండలానికి దళితబంధు కానీ, మధిరకు వంద పడకల ఆసపత్రి గానీ, గ్రామాలలో రోడ్లు వంటి అనేక అభివృద్ధి పథకాలు కేసీయార్ దూరదృష్టి వల్లనే తప్ప మధిర నియోజకవర్గం అభివృద్ధికోసం భట్టి చేసిందేమీ లేదన్నారు. ఎక్కడెక్కడో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో లేని వాడు ఎం.ఎల్.ఏ గా ఉండాలా? ప్రజలలో తిరుగుతూ వారికి అందుబాటులో ఉండేవాడు కావాల్నా? అనేది తేల్చుకోవాలని మధిర నియోజకవర్గం ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. ఈ సభలో రాష్ట్ర విత్తానభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, బోనకల్ మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ వేమూరి ప్రసాద్, చొప్పకట్లపాలెం రైతు సమన్వయ సమితి కన్వీనర్ కోటపర్తి యాకోబు, చిరునోముల ఎం.పి.టీ.సి కోటపర్తి హైమావతి, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు చేబ్రోలు మల్లిఖార్జునరావు, బోనకల్ మాజీ జెడ్.పి.టీ.సీ బాణోతు కొండా, చింతకాని జెడ్.పి.టీ.సీ పర్సగాని తిరుపతి కిషోర్, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు తన్నీరు కిషోర్, కార్యదర్శి బోయనపల్లి రవి, మండల నాయకులు బోయనల్లి పకీరయ్య, మాజీ సర్పంచి కొణకంచి నాగరాజు, మండల కమిటీ సభ్యుడు తన్నీరు పుల్లారావు, ఉప సర్పంచి బోయనపల్లి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గాన్నారు.
ప్రతి సారి దళిత బంధు దళిత బంధు అని డప్పు కొట్టుకున్నారు వీళ్లు మొన్న మీటింగ్ లో , దానికి నేను ఒప్పుకుంటా కానీ తెలంగాణా కి అప్పులు ఎన్ని పెరిగాయో కూడా ఆలోచించాలి ఆహ్ బంధుల వల్ల ఎవరికీ ఉపయోగం ?వాటి వల్ల జనాలని సోమరి పోతి ని చేస్తున్నారు వీళ్లు. మల్లి వీళ్లు మాట్లాడుతున్నారు , ఛిఛీ