జనవిజయంతెలంగాణఈటెలను చూసి నేర్చుకోవలసిందే.. మిగతా ఎం.ఎల్.ఏల రాజీనామాకు పెరుగుతోన్న డిమాండ్

ఈటెలను చూసి నేర్చుకోవలసిందే.. మిగతా ఎం.ఎల్.ఏల రాజీనామాకు పెరుగుతోన్న డిమాండ్

హైదరాబాద్,జూన్12(జనవిజయం): ఈటెల రాజేందర్ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. స్పీకర్ దానిని కేవలం గంటన్నర వ్యవధిలో ఆమోదించారు. ఈటల రాజీనామా అనంతరం సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఈటల రాజేందర్ తన ఎం.ఎల్.ఎ పదవికి రాజీనామా చేయడం ఇది మూడోసారి. తెలంగాణ ఉద్యమంలో 2008 , 2010లో రెండు సార్లు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్ స్థాపించిన తర్వాత ఏడాదికి ఆ పార్టీలో చేరి ఉద్యమస్పూర్తిని ప్రదర్శిస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఈటల ఎదిగారు. హైదరాబాద్‌, గజ్వేల్‌ ప్రాంతాల్లో ఉద్యమాల్లో పనిచేస్తున్న ఆయనను స్వంత నియోజకవర్గమైన కమలాపూర్‌కు వెళ్ళి పార్టీ బాధ్యతలను చేపట్టాల్సిందిగా కేసీఆర్‌ ఆదేశించారు. ఆమేరకు తన సొంత నియోజకవర్గమైన కమలాపూర్‌కు వచ్చిన ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 2004లో అక్కడి నుంచి పోటీచేసి మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డిని ఓడించి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆ తర్వాత ఉద్యమ అవసరాల కోసం 2008, 2010లో రాజీనామాచేసి ఉప ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్‌ నియోజకవర్గం రద్దయింది. కొత్తగా హుజూరాబాద్‌ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు హుజురాబాద్‌ శాసనసభ్యుడిగా గెలుపొందారు. వరుసగా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన రికార్డును సాధించిన ఈటల రాజేందర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్‌ మంత్రివర్గంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో కేసీఆర్‌ రెండో మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఏడేళ్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆరెస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కాగా ఈ విషయంలో ఈటెలను చూసి నేర్చుకోవల్సిందే నంటూ సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్ అవుతోంది. ఒక పార్టీ గుర్తుపై ఎన్నికలలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు ….వేరే పార్టీలో చేరినా , చేరాలనుకున్నా ….ఈటెల లాగ నైతిక విలువలు పాటించి …ముందుగా  పదవికి రాజీనామా చెయ్యాలి. … ఈటెల కరెక్టా? కాదా? అన్నది నాకు తెలియదు కానీ ….అతను ప్రదర్శించిన నైతికత మాత్రం అందరూ చూసి నేర్చు కోవలసిందే అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంలో ఈటెలను చూసి నేర్చుకోవాల్సిందే నంటూ చెబుతున్న విషయం అందరినీ ఆలోచింప జేస్తుంది. మరోవైపు ఇపుడున్న ఎం.ఎల్.ఏలలో పార్టీ మారినా రాజీనామా చేయనివారు రాజీనామాలు చేయాలనే డిమాండ్ ముందుకు వస్తుండడం గమనార్హం.

సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్ అవుతోన్న మరో విషయం ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటినుండి ఇప్పటి వరకూ ఎవరైనా రాజీనామా చేస్తే మీ రాజీనామా మీద ఎవరి ఒత్తిడైనా ఉందా..ఆవేశంతో మీరు రాజీనామా చేస్తున్నారా? రాజీనామా లేఖను ఉపసంహరించుకుంటారా? ఇదే ఫైనల్ నిర్ణయమా అనే విషయాలను ద్రువీకరించుకున్న తర్వాతే రాజీనామాలను ఆమోదించే వారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన రెండు సార్లు అదే విధానాన్ని అవలంభించారు. కానీ ఈ దఫా భిన్నంగా గంటన్నరలోనే రాజీనామాను ఆమోదించారు. స్పీకర్ కు ఆ విచక్షణాధికారం ఉన్నా ప్రోసిజర్ ప్రకారం జరగలేదనిపిస్తుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తుండడం గమనార్హం. ఈటలకు వివరణ ఇచ్చుకునే అవకాశం అస్సలు ఇవ్వడం లేదు. బర్తరఫ్ నుంచి రాజీనామా వరకు అదే జరుగుతోంది. నేడు ఉదయం 11:30 గంటలకు స్పీకర్ ఛాంబర్ లో అసంబ్లీ కార్యదర్శికి ఈటల రాజీనామా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈటల రాజీనామాపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వేగంగా స్పందించారు. కేవలం గంటన్నర వ్యవధిలో ఈటల రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. హుజురాబాద్ నియోజకవర్గం ఖాళీ చూపుతూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అసంబ్లీ కార్యదర్శి ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ఏడేళ్లల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌గా నిలిచారు. పదవీ కాలం ఉండగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇది మూడోసారి.

ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నసందర్భంగా నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన పద్ధతిలోనే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో కూడా.. కేసీఆర్ రాజీనామా చేయించాలని  మాజీ ఎం.పి, కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇదే విషయం సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ అవుతోంది. ఈటెలను ఆదర్శంగా తీసుకుని పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరిన వారంతా నైతికంగా విలువలు పాటించాలని, వారంతా రాజీనామా చేయాలని డిమాండ్ ఊపందుకుంటోంది. నిజంగా అలా జరిగితే ప్రజాస్వామ్యానికి శుభపరిణామమే. అంత దమ్మున్న నేతలు ఇపుడున్నారా? ఈ డిమాండ్ కు ఆ నేతలు నిలబడతారా? ముందుకొచ్చి రాజీనామా చేస్తారా? అంటే అంత సీన్ లేదనే చెప్పవచ్చు.

నైతికంగా బాధ్యత వహిస్తూ పార్టీ మారబోయే ముందు రాజీనామా చేసిన ఈటలకు అసెంబ్లీ ముందు మద్దతును ప్రకటిస్తున్న యువత. మిగతా వారూ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

 

 

 

 

 

 

 

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి