Thursday, October 5, 2023
Homeవార్తలుసమాజ శ్రేయస్సుకు ఈర్ష్య ద్వేషం వీడాలి

సమాజ శ్రేయస్సుకు ఈర్ష్య ద్వేషం వీడాలి

సమాజ శ్రేయస్సుకు ఈర్ష్య ద్వేషం వీడాలి

  • ఆచరణాత్మక ఆలోచనలు ఉండాలి
  • ధర్మం తెలుసుకో ఆచరణకు పూనుకో
  • ప్రముఖ రచయిత కవి శాగంటి కృష్ణమూర్తి

కారేపల్లి, జూలై 22(జనవిజయం):

మానవ మనుగడకు ఈర్ష్యా ద్వేషాలు అడ్డంకులుగా నిలుస్తున్నాయని వాటిని వీడాలని ప్రముఖ కవి, రచయిత శాగంటి కృష్ణమూర్తి అన్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం కారేపల్లి వచ్చిన సందర్భంగా కారేపల్లి శివాలయంలో విలేకరులతో మాట్లాడారు. మహత్ములు సమాజ శ్రేయస్సుకు ఈర్ష్యా ద్వేషాలు వదులుకోని కృషి చేసిన ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్చా వాయువులన్నారు.

ధర్మం తెలుసుకోని దాని ఆచరించటం మానవ నైజంగా ఉండాలన్నారు. సమాజ చైతన్యం కోసం తనకు ఆహ్వానం లేకుండానే కార్యక్రమాలకు హాజరవుతుంటానన్నారు. పల్లె, పట్టణం అని కాకుండా ఎక్కడికైనా వెళ్ళి ఆ కార్యక్రమం విశిష్టితకు అనుగుణంగా రచనలు, పాటల రూపంలో వివిరిస్తుంటానన్నారు.

సామాజిక అంశాలు, పండుగల విశిష్టత, ఆధ్యాత్మిక వంటి 70కి పైగా అంశాలపై సామాజిక వ్యాసమంజలి పుస్తకాన్ని రచించి విడుదల చేసినట్లు తెలిపారు. కారేపల్లి మండలం కమలాపురంకు చెందిన శాగంటి కృష్ణమూర్తి ప్రస్తుతం ఇల్లందులో నివాసం ఉంటున్నారు.

88 ఏండ్ల వయస్సులోను ఉత్సహంతో ధర్మోరక్షితి రక్షత: అంటూ పలు కార్యక్రమాలలో ప్రసంగాలు చేస్తుంటారు. సమాజ సేవ రచనలకు గాను అల్‌ది బెస్ట్‌ అకాడమి సంస్ధ ప్రకటించిన జీవన సాఫల్య అవార్డును విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్‌ చేతుల మీదిగా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదిగా సాహితి ఆణిముత్యం అవార్డు, నేషనల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు వంటి ఎన్నో అవార్డులను అందుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments