–డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ పిలుపు
-ముఖ్య అతిథిగా హాజరుకానున్న డి.వై.యఫ్. ఐ ఆలిండియా అధ్యక్షుడు యం.పి యమ్.ఎ.రహీమ్
రఘునాదపాలెం, ఆగస్ట్22 (జనవిజయం): హాన్మకొండలో ఆగస్ట్ 25 నుండి 3 రోజుల పాటు జరిగే డి.వై.యఫ్.ఐ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జరుగుతులన జయప్రదం చేయాలని డి.వై. యఫ్. ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల. రమేష్ పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా డి.వై.యఫ్.ఐ ఆలిండియా అధ్యక్షుడు,యం.పి యమ్.ఎ.రహీమ్ హాజరవుతున్నారని తెలిపారు. స్థానిక చిమ్మపుడి గ్రామంలో డివైఎఫ్ఐ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతల.రమేష్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ రాష్ట్ర విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఆగస్టు 24 25 26 తారీకుల్లో హనుమకొండ జిల్లాలో హనుమకొండలో జరగబోతున్నాయని ఈ క్లాసులకు జిల్లా నుంచి 100 మంది హాజరవుతున్నట్లు తెలియజేశారు.
జిల్లా క్లాసులు సెప్టెంబర్ నెలలో మొదటి వారంలో ఖమ్మంలో జరగబోతున్నాయని ఈ క్లాసులు జయప్రదం చేయాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు జోనెబోయిన. నవీన్, వెంకటేష్, దోంతు.గణేష్,పోతురాజు. వేణు తదితరులు పాల్గొన్నారు.