తిరుమలాయపాలెం, ఆగస్టు 18 (జనవిజయం): భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా ,రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ కార్యకర్తలకు మరియు యువతీ యువకులకు పిలుపునిచ్చారు. తిరుమలాయపాలెం మండలం మేడిపల్లి గ్రామంలో డివైఎఫ్ఐ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం డివైఎఫ్ఐ మండల నాయకులు మాచర్ల రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ రాష్ట్ర విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఆగస్టు 24, 25, 26 తారీకుల్లో హనుమకొండ జిల్లాలో హనుమకొండలో జరగబోతున్నాయని ఈ క్లాసులకు జిల్లా నుంచి 100 మంది హాజరవుతున్నట్లు తెలియజేశారు. జిల్లా క్లాసులు సెప్టెంబర్ నెలలో మొదటి వారంలో ఖమ్మంలో జరగబోతున్నాయని ఈ క్లాసులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి దాసరి మహేందర్, జిల్లా నాయకులు దిండు మంగపతి, శ్యామ్, నాగాటి సురేష్, పుల్లూరు నాగేశ్వరరావు, రాము, సైదులు ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.