జనవిజయంఆరోగ్యందేశంలో దూసుకు వస్తున్న బ్లాక్ ఫంగన్

దేశంలో దూసుకు వస్తున్న బ్లాక్ ఫంగన్

  • ఇంతవరకూ 5,424 బ్లాక్ ఫంగన్ కేసులు నమోదు
  • కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడి

న్యూఢిల్లీ, మే24(జనవిజయం): దేశంలోని పలు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఇంతవరకూ 5,424 బ్లాక్ ఫంగన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్ పై మంత్రుల గ్రూపుతో సోమవారం జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బ్లాంగ్ ఫంగన్ కేసుల్లో మెజారిటీ కేసులు కోవిడ్ బారిన పడిన వారేనని, వారిలో సగమందికి డయాబెటిన్ కూడా ఉందని చెప్పారు. కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ సహా పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంతవరకూ 5,424 మందికి బ్లాగ్ ఫంకన్ వచ్చిందన్నారు. వీరిలో 4,556 మందికి కోవిడ్ చరిత్ర ఉందని, 55 శాతం మంది పేషెట్లకు మధుమేహ వ్యాధి ఉందని వివరించారు. కోవిడ్ బారిన పడిన పేషెంట్లలో బ్లాక్ ఫంగన్ కేసుల ట్రెండ్ క్రమంగా దేశంలో పెరుగుతోంది. కోవిడ్ ట్రీట్మెంట్ లో హెచ్చు మోతాదులో స్టెరాయిడ్స్ వాడటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన వారిని గుర్తించేందుకు వీలుగా బ్లాగ్ ఫంగనను అంటువ్యాధుల చట్టం-1987 కింద నోటిఫయబుల్ వ్యాధిగా పలు రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. వ్యాధుల స్క్రీనింగ్, డయాగ్నసిన్, మేనేజిమెంట్ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు అమలు చేస్తున్నాయి. కోవిడ్ పేషెంట్లలో, ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్లలో బ్లాగ్ ఫంగస్ ను గుర్తుస్తున్నారు. ఇది ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధిగా చెబుతున్నారు. కోవిడ్ చికిత్స సమయంలో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఉపయోగించడం అనేది బ్లాగ్ ఫంగన్ పెరుగుదలకు కారణమవుతోందా అనే అంశంపై కూడా కర్ణాటకలో నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి