Tuesday, October 3, 2023
Homeవార్తలుడూప్లికేట్ సోనీ టి.వి లను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా ను పట్టుకున్న పోలీసులు

డూప్లికేట్ సోనీ టి.వి లను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా ను పట్టుకున్న పోలీసులు

అందరూ ఉత్తరప్రదేశ్ కి చెందిన వారే

 

డూప్లికేట్ సోనీ టి.వి లను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా ను పట్టుకున్న పోలీసులు

ఖమ్మం, 9 ఆగస్ట్( జనవిజయం ): యుపి రాష్ట్రానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 31 సం. మరియు 23 సం. వయస్సు గల వారు ఖమ్మం రూరల్ మండలం ఎదులపురం గ్రామానికి వచ్చి ఎటువంటి బిల్లులు లేకుండా సోనీ టీవీలను విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫర్స్ మరియు ఖమ్మం రూరల్ పోలీస్ బృందం ఎదులపురం గ్రామానికి చేరుకొని వారిని అక్కడ రెడ్ హ్యాండెడ్ టీవీలు విక్రస్తుండగా పట్టుకొని వెంటనే ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…   ఇస్లాంపూర్ ఘసాలి గ్రామం , షామిలి జిల్లా , ఉత్తర ప్రదేశ్ నుండి మొత్తం ఐదుగురు వ్యక్తులు హైదరాబాద్ వచ్చారు.
వారి జీవనోపాధిలో భాగంగా దుప్పట్లు , గ్యాస్ స్టవ్ లు చిన్న చిన్న ఎలక్ట్రికల్ గూడ్స్ ను అమ్ముకుంటూ హైదరాబాద్ లో జీవిస్తున్నారు . వారి ఆర్ధిక అవసరాలకు ఆ డబ్బులు సరిపోవక పోవడం వలన వారు హైదరాబాద్ లో స్మార్ట్ టీవీ లు ( అసెంబుల్డ్)  వాటి మీద సోనీ కంపెనీకి చెందిన స్టిక్కర్స్ లు అంటించి నిజమైన బ్రాండెడ్ సోనీ కంపెనీకి చెందిన టీవీలుగా నమ్మించి వాటినీ , అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయ అని అత్యాశ తో హైదరాబాద్ నుండి సుమారు ( 32 ) టివీలు కొనుక్కొని ఖమ్మం కు సమీపం లోని ఎదులపురం గ్రామం ఖమ్మం రూరల్ మండలం కు తీసుకొచ్చి అదే గ్రామంలో ఒక ఇల్లును అద్దెకి తీసుకొని వుంటూ.. ప్రతి రోజు ఖమ్మం చుట్టుప్రక్కల గ్రామాలలో తిరుగుతూ అమాయక ప్రజలను మోస పూరితమైన మాటలు చెప్పి సోనీ టీవీ అని సోనీ నకిలీ స్టిక్కర్స్ , స్టార్ రేట్టింగ్ స్టిక్కర్స్ , సోనీ లోగో మరియు QR కోడ్ గల స్టిక్కర్స్ టీవీ లకు అంటించి వారిని నమ్మించి విక్రయిస్తున్నారు. మరియు వారికి ఆర్మీ క్యాంటీన్ కార్డు వున్నట్లు నకిలీ కార్డు ను సృష్టించుకొని వారు ఆ కార్డు ద్వారా క్యాంటీన్ లో వాటిని కొన్నట్లు నమ్మబలికించి విక్రయిస్తున్నారు .
అదేవిధంగా ఒక పెన్ డ్రైవ్  లో సోనీ అని ఇంగ్లీష్ లో.. టీవీ పవర్ ఆన్ చేయగానే వచ్చే విధంగా సాఫ్ట్వేరే ను తెచ్చుకొని దానిని ఇంస్టాల్ చేసి అమాయక ప్రజలను మోసం చేస్తూ వారు తెచ్చుకున్న స్మార్ట్ టీవీ లను ఒరిజినల్ సోనీ టీవీ లుగా నమ్మించి ఒకోక్క టీవీని సుమారు 15000 / – నుండి 20000 / – వరకు విక్రయించి అధిక డబ్బులను సంపాదించుకుంటున్నారు .
వారి వద్దనుండి స్వాధీనం పరుచుకున్న వస్తువుల
వివరాలు :
1 ) నగదు రూ . 2,90,000 / – , 2 ) ఎల్.ఈ.డి స్మార్ట్ టీవీ లు 43 ఇంచులవి – 32 , 3 ) వ్యాగనార్ కార్ నంబర్ డి.ఎల్. 9సి క్యు. ఎస్ 0879 , 4 ) హోండా యాక్టివా  బైక్- 04 , వాటి నంబర్లు . 1 ) టి.ఎస్ 02 ఈ.బి 9344 , 2 ) . టి.ఎస్. 02 ఈ.ఆర్ 0127 , 3 ) . టి.ఎస్ 02 ఏ.వై 3283 , 4 ) ఏ.పి 15 ఏ.ఎస్ 3438. 5)  స్మార్ట్ సెల్ ఫోన్ లు -05 , 6 ) సోనీ డూప్లికేట్ స్టిక్కర్స్ లు , సోనీ లోగో స్టిక్కర్స్ లు , సోనీ స్టార్ రేట్టింగ్ స్టిక్కర్స్ లు , క్యు ఆర్ కోడ్ కు సంబంధిచిన స్టిక్కర్స్ .7 ) ఆర్మీ క్యాంటీన్ కార్డు
నిందితుల వివరాలు
1 ) సిద్దాం  తండ్రి  యూనస్ , 31 సంవత్సరాలు , వ్యాపారం ,  ఇస్లాంపూర్ ఘసాలి గ్రామం , షామిలి జిల్లా , ఉత్తర ప్రదేశ్ . 2 ) . ఆసిఫ్ , తండ్రి యూనస్ , 23 సంవత్సరాలు , వ్యాపారం ,  ఇస్లాంపూర్ ఘసౌలి గ్రామం , షామిలి జిల్లా , ఉత్తరప్రదేశ్ . 3 ) , అనుస్ ఖాన్ , తండ్రి మహమ్మద్ షాహిద్ , 23 సంవత్సరాలు , వ్యాపారం ,  ఇస్లాంపూర్ మసాలిగ్రామం , షామిలి జిల్లా ఉత్తరప్రదేశ్
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments