జనవిజయంఆంధ్రప్రదేశ్దుబారా పథకాలకు అంతమెప్పుడో ?

దుబారా పథకాలకు అంతమెప్పుడో ?

పెట్రోల్ భారం విపరీతం అవుతోంది. జిఎస్టీ భారంత మోయలేనంతగా మారింది. పన్నుల మోతే తప్ప ప్రజలకు ఆదాయం వచ్చే కార్యాక్రమాలు సాగడం లేదు. ఇలా పన్నులు పెంచుతూ పేదలను కొట్టి పెద్దాళ్లకు పెట్టే చందంగా పాలకులు తీరు ఉంది. ప్రజలను పీల్చి పిప్పి చేసి వసూలు చేసిన పథకాలు దేశ పునర్నిర్మాణానాకి ఉపయోగపడుతున్నాయో లేదో తెలియడం లేదు. అదేపనిగా దుబారాకు మాత్రం ఖర్చు చేస్తున్నారు. వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటే, ఆస్పత్రులను అభివృద్ధి చేయాలంటే మాత్రం చేతులు రావడం లేదు. ఉద్యోగ, ఉపాధి కోసం కార్యాక్రమాలను చేపట్టడం లేదు. ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను మూసేస్తున్నారు. ఎపిలో విశాఖ స్టీలను తెగనమ్ముతున్నారు. గంగవరం పోర్టును ఆదానీకి కట్టబెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కుట్రలు బయటపడగలవు. ఎపిలో జగనన్న పేరుతో పథకాలకు లెక్కేలేదు. రోజూ ఓ పంపిణీ కార్యక్రమం సాగడం మినహా అభివృద్ది కార్యక్రామలు శూన్యం. ప్రజలపై పన్నుల భారం మోపడం ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమం పేరిట దుబారా పథకాలు కొనసా గించాలా? అన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి.

లాక్ డౌన్ కారణంగా అనేక రకాలుగా ఛార్జీలు పెరిగాయి. నిత్యావసర ధరలు ఆకాశానికి పరుగెడుతున్నాయి. ప్రజలకు డబ్బులను పెంకాసుల్లా పంచుతున్న నేతలు ఓ వైపు భారం మోపుతూ..వాటి ద్వారా వచ్చే మొత్తాలను పందేరం చేస్తూ వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతున్నారు. తామంతా దాన కర్ణుల్లాగా.. చేతికి ఎముక లేదన్న తీరుగా పథకాల పేరుతో ప్రజల డబ్బులను పంచడమే లక్ష్యంగా దుబారా చేస్తున్నారు. ఖజానాను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి పథకాల వల్ల ప్రజలను సోమరులుగా చేయడం తప్ప మరోటి కాదు. విద్యుత్ బిల్లులను తగ్గించడం లేదా రద్దు చేయడం మాత్రం చేయడం లేదు. అలాగే ఇంటి పన్నులను రద్దు చేయడం లేదు. ఎపిలో అయితే విచ్చలవిడిగా నగదు బదిలీ పథకాలు సాగుతున్నాయి. వీటిని ఆపేందుకు ఎవరు ముందుకు రావాలో కూడా తెలియడం లేదు. విపరీతంగా పన్నుల భారం మోపుతూ కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తమకు నచ్చిన పథకాలను అమలు చేస్తున్నారు. ఉదాహరణకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అందచేస్తున్న కిలో రూపాయి బియ్యం పథకం పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదు. సరికదా ఇంకా సన్నబియ్యం సరఫారా చేస్తామని, అందమైన ప్యాకుల్లో సరఫరా చేస్తామని ప్రకటించారు. నిజానికి రూపాయికి ఏ వస్తువుకూడా రావడం లేదు. చాక్లెట్ లేదా పిప్పరమెంట్ కూడా రాదు. కానీ వీటిని ఇంటింటకీ సరఫరా చేసేలా ఎపిలో పధకం కొనసాగిస్తున్నారు.

కులాల వారీగా పథకాల పేరుతో డబ్బులను విదల్చడం ఏ రకమైన సంక్షేమమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయినా దీనిపై కోట్లాది రూపాయలను దుబారా చేయడం వెనక ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప మరోటి కానరావు. కరోనాతో ప్రజల జీవితాలు అతలా కుతలం అయితే.. ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచన చేయాల్సిన తరుణం ఇది. ఎపిలో ఇప్పుడు నన్నబియ్యం ప్యాకెట్లలో సరఫరా చేయడం ఇదో వ్యాపార పథకంగా మారనుంది. రూపాయికి కొత్తిమీర కూడా లభించని ఈ రోజుల్లో ఇంకా ఈ పథకాన్ని కొనసాగించడం ఆర్థిక భారం తప్ప మరోటి కాదు. దీనికితోడు ఇంటింటికి బండిని పంపి పంపిణీ చేయడం తడిసిమోపెడు అవుతోంది. ఈ పథకాన్ని కొనసాగిస్తున్నందున ఆర్థిక భారం పడుతోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో అనేక పధకాలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. అధికారం ఉందికదా అని ఖజానాను ఇష్టం వచ్చినట్లు పంచుతూ పోవడం ఎంతవరకు సమంజనమో ఆలోచన చేయాలి. తాము చేస్తున్న ఖర్చు తమ సొంత సంపాదన కాదని పాలకులు గుర్తించడం లేదు. అలాగే ప్రజలు చెమటోడ్చి కట్టిన పన్నుల డబ్బులను దుబాగా చేయడం కూడా సరికాదు. ప్రజలను స్వశక్తిమీద నిలబడేలా చేసే పథకాలను అమలు చేయాలి. వారు సొంతంగా కాళ్లపై నిలబడి సంపాదించుకునే పథకాలు చేపట్టాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడేలా చర్యలు తీసుకోవాలి.

ఉచిత పథకాలపై సమీక్షించకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికమాంద్యం కూడా తీవ్ర ప్రభావం చూపగలదని తాజాగా కరోనా ద్వారా ఏర్పడ్డ పరిస్థితులు సూచిస్తున్నాయి. ప్రజలు చెమటోడ్చి పన్నుల రూపంలో కట్టిన డబ్బులు వృధా పథకాలతో దుబారా చేస్తున్న పథకాలకు చరమగీతం పలకాలి. ప్రజల డబ్బులకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు తమకు అనుగుణంగా, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పథకాలను కొనసాగించడం సరికాదు. బియ్యం పథకంపై ఆజమాయిషీ లేకపోవడం వల్ల చౌక బియ్యాన్ని తినడానికన్నా అమ్ము కోవడానకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కొందరికి ఆదాయ వనరుగా మారింది. ఈ బియ్యంతో హోటళ్లలో టిఫిన్లు తయారవుతున్నాయి. అలాగే సరిహద్దులు దాటి సన్నబియ్యంగా మారుతున్నాయి. పాలకుల దూరాలోచన లేని కారణంగా ఈ బియ్యం పథకం కేవలం వ్యాపార దృక్పథంతో సాగుతున్నాయి. తాజాగా ఎపిలో ప్యాకింగ్ కవర్లలో ఇవ్వడం వల్ల మరింత ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. సిబ్బంది కొరత, కొరవడిన తనిఖీలకు ప్రజల అమాయకత్వం జత కలవడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. బియ్యం అక్రమ రవాణా చేయడం నిత్యకృత్యంగా మారినా అరికట్టాల్సిన అధికారులు చేష్టలుడిగి ప్రేక్షక పాత్రకు పరిమితమవుతున్నారు.

అలాగే ఇబ్బడిముబ్బడిగా డబ్బులను పంచే పథకాలు పెంచుతూ పోతున్న వారు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు విద్యుత్ బిల్లులను తగ్గించడమో లేదా రద్దు చేయడమో చేయాలి. ఇంటిపన్నులను రద్దు చేయాలి. ప్రభుత్వ పరంగా ఏ మేరకు సాయం చేయగలమో ఆలోచన చేయాలి. పేద, మధ్యతరగతి ప్రజలు మళ్లీ తమ బతుకులు గాడినపడేలా చేయాలి. అవసరమైన చేయూతను అందించాలి. అంతేకానీ అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రజల కష్టార్జితాన్ని పందేరం చేస్తూ తాము దాన కర్ణులం అన్న ప్రచారం మానుకోవాలి. ప్రజలను పన్నలు భారంతో పీడించే బదులు ఉచిత పథకాలను పక్కన పెట్టాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగా, ప్రజలు ఉపాధి పొందే పథకాలను ప్రోత్సహించాలి. అభివృద్ధి పనులతో ఆదాయాన్ని పొందేలా చేయాలి. ఉపాధి మార్గాలను పెంచాలి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి