భద్రాచలం,ఆగస్టు 30 (జనవిజయం): భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజుల నుండి మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తుల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు..ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన 30 మంది వాహనదారులకు బుధవారం స్థానిక భద్రాచలం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ లో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ తాగి వాహనాలు తీసేటప్పుడు వాహనదారులు వారి యొక్క కుటుంబసభ్యుల గురించి ఒక్కసారి ఆలోచించాలని,ఏదైనా ప్రమాదం జరిగి ఇబ్బంది పడే కంటే ఎవరూ తాగి వాహనాలు నడపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని ఆయన కౌన్సెలింగ్ ద్వారా వాహనదారులకు తెలిపారు.మళ్లీ ఇదే విధంగా తాగి వాహనాలు నడిపి దొరికినట్లు అయితే వారి యొక్క లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు.పట్టణం లోని వాహనదారులు ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలను నడపవద్దని ఇక నుండి ప్రతి రోజు భద్రాచలం పట్టణంలో ఏదో ఒక ప్రదేశంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.