
ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న మంద కృష్ణ మాదిగకి ప్రత్యేక అభినందనలు
ఎం.ఆర్.పి.ఎస్ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు
ఖమ్మం, 12 సెప్టెంబర్(జనవిజయం) : మధిర లోని ఎం.ఆర్.ఓ కార్యాలయం దగ్గర ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఎస్.సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని చేస్తున్న ఎం.ఆర్.పి.ఎస్ రిలే నిరాహార దీక్షకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా డా.కోట రాంబాబు మాట్లాడుతూ., అధికారంలోకి రాగానే వర్గీకరణ చేస్తాం అని చెప్తున్న అధికార పార్టీ నాయకుల మాటలు అన్నీ నీటి మూటలు అవుతున్నాయని, అత్యధిక సామాజిక వర్గం కలిగిన మాదిగలు కోరుతున్న ఈ న్యాయమైన అంశాన్ని ఈ నెల 18 నుండి 22 వరకు జరుగుతున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో అధికార పార్టీ నాయకులు ఈ అంశం మీద చర్చించి వర్గీకరణ చేసేవిధంగా మాట్లాడాలి అని అన్నారు. ఏ పార్టీ లో ఉన్న మేము ఉన్న పార్టీ నుండి పైస్థాయి నాయకులతో మాట్లాడి వారి సహకారంతో వర్గీకరణ అంశం మీద పార్లమెంటు లో మాట్లాడే విధంగా చేస్తాము అని, ఈ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న మంద కృష్ణ మాదిగకి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రారంభించిన రిలే నిరాహారదీక్షకు పూర్తి మద్దతు ఇస్తూ అన్ని విధాలా అండగా ఉంటాము అని హామీ ఇచ్చారు.
0000000000000000000P0000000000000000000001