భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 15 (జనవిజయం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ ) శీలం శ్రీనివాస్ ఉత్తమ అధికారి గా ప్రశంసాపత్రం అందుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగం గా జిల్లా లో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది కి వారు అందించిన సేవలను గుర్తించి ఉత్తమ సేవా ప్రశంసా పత్రాలను ముఖ్యఅతిధి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అందజేశారు. ప్రశంసా పత్రం అందుకున్న శ్రీనివాస్ ను ఈ సందర్భం గా పలువురు అభినందించారు.