కొణిజర్ల, జులై 16(జనవిజయం):
మండలంలోని రామనర్సయ్య నగర్ గ్రామ క్రియాశీల కార్యకర్త నూనవత్ నరేష్ అత్తగారు బానోత్ దోర్జన్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మరణించిన సంగతి తెలుసుకొని ఆదివారం నాడు ఆ కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్, వైరా అసెంబ్లీ బిజెపి నేత బీపీ నాయక్ పరామర్శించారు. అనంతరం కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు, వారి కుటుంబానికి తన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ గుగులోత్ కుమార్, పోలింగ్ బూత్ అధ్యక్షులు రాజా, యువకులు మహిళలు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.