చిన్నారిపై వీధి కుక్కల దాడి
కంటికి తీవ్ర గాయాలు అవడంతో హైదరాబాదుకు తరలింపు
బోనకల్, ఫిబ్రవరి26, జనవిజయం
వీధుల్లో కుక్కలు కనిపిస్తే చాలు స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రోడ్డు వెంబడి నడవాలంటే జనం జంకుతున్నారు.తాజాగా బోనకల్ మండల కేంద్రంలోని శనివారం ఓ నాలుగేళ్ల చిన్నారి మంద జస్మిత తండ్రి పుల్లయ్య సాయంత్రం సమయంలో ఆడుకుంటున్న సమయంలో ఓ వీధి కుక్క అమాంతం ఆమెపై పడి కుడి కన్నును గాయపరచగా ఆమెకు తీవ్ర విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాపను హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా రిఫర్ చేశారు.
తల్లిదండ్రులు కన్నీరు మునీరుగా రోదిస్తూ తమ బిడ్డను హైదరాబాదుకు తీసుకు వెళ్ళడం జరిగింది. గ్రామంలో వీధి కుక్కల నివారించవలసిందిగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు స్థానిక సర్పంచ్ భూక్యా సైదా నాయక్ తో మాట్లాడారు. త్వరలోనే చర్యలు చేపట్టినట్లు అందుకు అందరు సహకారం కావాలని సర్పంచ్ తెలియజేశారు. ఏది ఏమైనా వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్న వాటిని నియంత్రణలో అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనీ మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.