జనవిజయంఆరోగ్యం3.డాక్టర్ ఇచ్చేదేమిటి?

3.డాక్టర్ ఇచ్చేదేమిటి?

వైద్యం వేరు, ఆరోగ్యం వేరు. కాబట్టి వైద్య, ఆరోగ్య శాఖామంత్రి అని విడిగా పలుకుతారు. వైద్యాన్ని చేయవలసినవారు ముందు వైద్య శాస్త్రాన్ని చదువుతారు. ఆ వైద్య శాస్త్రంలో రోగాన్ని గురించి, రోగ లక్షణాలను గురించి దానికి చేయవలసిన చికిత్సల గురించి ఉంటుంది. వైద్యులు తెలుసుకున్నది, చదువుకున్నది రోగం, రోగ లక్షణాలు, దాని చికిత్సలు కాబట్టి వీరికి వీటి గురించే అవగాహన ఉంటుంది. మనలో రోగం వచ్చి దాని లక్షణాలు మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నప్పుడు, ఆ ఇబ్బందిని పోగొట్టుకోవడానికి మనం వైద్యుల్ని సంప్రదిస్తాము. వైద్యులు ఆరోగ్యానికి, లక్షణాలకు చికిత్స చేస్తారు. మనకు ఉపశమనం లభిస్తుంది. వారు చేసిన వైద్యం వల్ల రోగం లోపలే ఉండి దాని లక్షణాలు పూర్తిగా తగ్గటం వలనన్నా, మనకు ఉపశమనము కలిగియుండవచ్చు. లేదా పూర్తిగా ఆ రోగమే తగ్గిపోయి ఉండడం వల్ల కూడా పూర్తి ఉపశమనము రావచ్చు. ఏది జరిగినా మనకు ఉపశమనము లభిస్తుంది. రోగము లేదా రోగ లక్షణాలు తగ్గడం అనేది ఉపశమనమా? లేదా ఆరోగ్యమా? అది ఆరోగ్యమనుకుంటే పొరపాటు. రోగం రాకుండా ఉండడము అనేది ఆరోగ్యము. వైద్యులిచ్చినది ఆరోగ్యాన్ని కాదు, ఉపశమనాన్ని మాత్రమే. ఉపశమనము ఆరోగ్యం కాదు.

ఒక రోగం పోయిన కొంతకాలానికి మరొక రోగం వస్తుంది. మళ్ళీ వైద్యులను సంప్రదించి ఆ రోగానికి కూడా ఉపశమనము పొందుతూ ఉంటారు. ఇలా రోగాలు మనకు వస్తూనే ఉంటున్నాయి. అలా వైద్యాన్ని చేయించుకుంటూనే ఉంటున్నాము. ఇలా సంవత్సరాల తరబడి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ మా డాక్టరుగారు, మా ఫ్యామిలీ డాక్టరుగారు అని అభిమానంగా డాక్టర్లని పిల్చుకుంటూ ఉంటాము. వచ్చిన రోగాల్ని తగ్గించుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లేనా? కొత్తరోగం పుట్టకుండా, ఏ జబ్బులు ఇక జీవితంలో రాకుండా ఏవన్నా మందులుంటాయా? అలాంటి వాటినిచ్చే వైద్య విధానాలు ఉన్నాయా? అలాంటి వైద్యులున్నారా? అని ప్రశ్నించుకుంటే, అలాంటివి ఉంటే మనందరి పరిస్థితి ఇలా ఎందుకుంటుంది అని సమాధానం వస్తుంది. రోగాన్ని పోగొట్టడం వరకు వైద్యులు చేసినా రోగాన్ని రాకుండా మాత్రం వైద్యులు చేయలేకపోతున్నారు. రోగం రాకుండా ఉండాలంటే ఆరోగ్యం బాగుంటే ఉంటుంది. ఆరోగ్యమనేది లోపల ఉన్నంతకాలం రోగమనేది దరిచేరదు. ఆరోగ్యం తప్పుకున్నప్పుడే రోగం ప్రవేశిస్తుంది. ఉదా|| వెలుతురున్నంత సేపు చీకటి ఉండలేదు. ఎప్పుడైతే వెలుతురుపాలు తగ్గుతూ ఉంటుందో చీకటి పాలు పెరుగుతూ ఉంటుంది. వెలుతురు సాంతం పోతే చీకటి ముసురుకుంటుంది. ఇక్కడ వెలుతురు ఆరోగ్యం , చీకటి అనారోగ్యం . వెలుతురుతో చీకటిని ఛేదించాలి తప్ప మరో మార్గం లేదు. అలాగే ఆరోగ్యంతో రోగాన్ని ఛేదించాలి. అప్పుడే అనారోగ్యం పోతుంది. మనలో పూర్తిగా ఆరోగ్యం అనే వెలుతురుంటే రోగం అనే చీకటి ఉండనే ఉండదు. వైద్య శాస్త్రాలు, వైద్యులు ఆ చీకిటిని తరిమికొట్టడానికి బదులు ఆ చీకట్లో ఇబ్బందులు లేకుండా బ్రతికేటట్లు చేస్తూ, వారు నేర్చుకున్న విద్యకు వారు న్యాయం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రచయిత: డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

రేపు ఆరోగ్యానికి, డాక్టర్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనే అంశం గురించి తెలుసుకుందాం….

మీ ఆరోగ్యం-మీ చేతుల్లో వ్యాసాలలో ఇంతక్రితం వ్యాసం డాక్టర్ అంటే? కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంతెన ఆరోగ్య సలహాలు అన్నీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి