జనవిజయంఆరోగ్యండాక్టర్ అంటే?

డాక్టర్ అంటే?

వైద్యో నారాయణో హరిః. వైద్యుడనే వాడు నారాయణుడని, భగవంతుడని మన పెద్దలు చెప్పారు. అసలు వైద్యుడనే మాటకు అర్థం చూస్తే వైద్యం చేసేవాడు వైద్యుడు అంటారు. వైద్యము అంటే చికిత్స అని అర్థము. చికిత్స చేసేవాడు వైద్యుడు. డాక్టర్ అనే మాటకు ఇంకొక అర్థం చూస్తే బోధించేవాడు అని చెప్పబడింది. డాక్టర్ యొక్క అసలు డ్యూటీ ఏమిటంటే రోగికి చికిత్స చేయడం, ఆ తరువాత బోధించడం అనే రెండు పనులు చేయడం. వచ్చిన జబ్బుకు చికిత్స చేసి ఆ తరువాత రోగికి మళ్ళీ ఈసారి ఆ జబ్బురాకుండా చూసుకోవాలంటే, ఏమి తప్పు చేస్తే ఆ జబ్బు వచ్చిందో, ఆ జబ్బురాకుండా ఏమి చేయాలో, ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో అవగాహన కలిగించే బోధన చేయాలి. నిజమైన వైద్యుడు చేయవలసినదేమిటంటే చికిత్సకు సగభాగాన్ని కేటాయించి, మరో సగభాగం సమయాన్ని రోగికి అవగాహన కలిగించే బోధన చేయాలి. వైద్య శాస్త్రం లెక్కల ప్రకారం చేయవలసినది ఇది. డాక్టరు చెప్పిన మాట పరమాత్ముడు చెప్పిన మాటగా అనుకుని చెప్పినది చెప్పినట్లుగా విని, ఆచరించమని మన పెద్దల మాటలు. ఈ రోజుల్లో ఎక్కువ మంది వైద్యులు చికిత్సే తప్ప బోధన విషయాన్ని ప్రక్కన బెట్టారు. వచ్చిన జబ్బును పోగొట్టి, లేని జబ్బు రాకుండా కాపాడుకునే మార్గాన్ని చూపవలసినది వైద్యులే. అలాంటి అవగాహన ప్రజల్లో లేకే రోజు రోజుకి రోగాలు పెరుగుతున్నాయి. వైద్యులు బోధించేటట్లుగా మారి అవగాహన కలిగిస్తూ ఉంటే, దానిని ప్రజలు చెప్పినది చెప్పినట్లుగా ఆచరణలో పెట్టగలిగినప్పుడు ఈ సమాజం ఆరోగ్యవంతంగా మారుతుంది. ఇలాంటి మంచి మార్పు ఇద్దరిలోను రావాలని కోరుకుందాము.

రచయిత: డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

రేపు డాక్టర్ ఇచ్చేది ఏమిటి? అనే అంశం గురించి తెలుసుకుందాం….

మీ ఆరోగ్యం-మీ చేతుల్లో వ్యాసాలలో ఇంతక్రితం వ్యాసం ఆరోగ్యం అంటే? కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంతెన ఆరోగ్య సలహాలు అన్నీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి