ప్రజావాణిలో మొదటి దరఖాస్తును దివ్యాంగుల నుండి స్వీకరించిన కలెక్టర్ డా ప్రియాంక
భద్రాచలం, జూలై 24 (జనవిజయం):
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా దివ్యంగుల నుండి మొదటి దరఖాస్తును స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా ప్రియాంక అలా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి ప్రజావాణి కార్యక్రమంను సోమవారం చేపట్టారు. గత సోమవారం ప్రజావాణి కార్యక్రమం భారీ వర్షాల కారణంగా వాయిదా వేసిన సంగతి విదితమే. ప్రజావాణిలో ప్రజల నుండి వారి సమస్యలపై వచ్చే దరఖాస్తులన్నింటినీ సంబంధిత శాఖ అధికారులు జాప్యం లేకుండా పరిష్కరానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.