.డిస్టిక్ యాక్ట్ 1874 ప్రకారం ఏఎన్ఎం పోస్ట్లు భర్తీ చేయాలి!..
- ..గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ డిమాండ్…
కాపిటల్ వాయిస్, 12 జూలై(భద్రాచలం): భద్రాచలం ఐ టి డి ఏ ముందు ఈరోజు గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పిఓ కి మెమోరాండం ఇవ్వడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ.., భద్రాచలం డివిజన్ పరిధిలో గల షెడ్యూల్డ్ ఏరియా కు సంబంధించిన నిరుద్యోగ ఆదివాసీలకు కాంట్రాక్టు ప్రతిపాదికన భర్తీ చేయుచున్న ఏఎన్ఎం పోస్టులను డిస్టిక్ యాక్ట్ ప్రకారం గా భర్తీ చేయాలని ఐ టి డి పి ఓ గారిని కోరడమైనది.ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖలో జీవో ఎంఎస్ నెంబర్ 68 ప్రకారం భద్రాచలం డివిజన్ పరిధిలోని స్థానిక నిబంధనలు పాటించి, గ్రామసభ పర్యవేక్షణలో తాత్కాలిక ఏఎన్ఎం పోస్టులు భద్రాచలం డివిజన్ పరిధిలో వారికే నియమించుటకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో పాయం కామేష్ పాయం సన్యాసి పూణెం నాగేశ్వరావు సున్నం సుబ్బయ్య పూసం సుభద్ర బట్టు జ్యోతి మడకం రమణ మడకం సాధమ్మ్ పడకం శంకరమ్మ సీత పాల్గొన్నారు