భద్రాద్రి కొత్తగూడెం, జూలై 15 (జన విజయం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గల వనవిహార్ లో జిల్లా అటవీ శాఖాధికారి రంజిత్ నాయక్ దంపతులను శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శాలువాలతో ఘనంగా సత్కరించారు. బదిలీ పై వెళుతున్న రంజిత్ నాయక్ ను మర్యాద పూర్వకం గా కలిసి మెమొంటో అందజేసి, శుభాకాంక్షలు తెలిపినట్లు రేగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజిత్ నాయక్ జిల్లా ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో మణుగూరు జడ్పీటిసి పోశం నర్సింహారావు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.