జనవిజయంఆరోగ్యంపారాహుషార్.....! దేశంలో ముప్పేటా వ్యాధుల దాడి !!

పారాహుషార్…..! దేశంలో ముప్పేటా వ్యాధుల దాడి !!

భారతదేశంపై వ్యాధులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇవి బయోవార్ గా కొందరు అభివర్ణిస్తున్నా.. వ్యాధులు సంక్రమణకు అవసరమైన అపరిశుభ్ర వాతావరణం భారత్ లో పుష్కలంగా ఉంది. గ్రామాలు ఇప్పుడు పూర్తి అపరిశుభ్ర వాతావరణలో ఉన్నాయి. పర్యావరణం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో కరోనాకు తోడు ముప్పేటా మరో మూడు ఫంగన్ ల దాడి జరుగుతోంది. దీనినుంచి బయటపడడానికి ప్రజలు తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంది. కరోనా మహమ్మారి కోరల నుంచి బయటపడాలంటే అన్ని దేశాలు తమ జనాభాలో పది శాతం మందికి వ్యాక్సిన్లు వేయాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అయితే మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా భారతదేశంలో మాత్రం వ్యాక్సిన్ ప్రక్రియ ఎప్పటికి పూర్తయ్యేనో అన్నది తెలియడం లేదు. దేశంలో ఉత్పత్తి చేస్తున్న నీరమ్, బారత్ బయోటెకు తోడు స్పుత్నిక్ వి కూడా చేరినా ప్రజలు నిత్యం వ్యాక్సిన్ కోసం కుస్తీపడుతూనే ఉన్నారు. స్పష్టమైన ప్రణాళిక అన్నది లేకుండా పోవడంతో ఇప్పుడు దేశంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. మరోవైపు కరోనాకు తోడు బ్లాక్, వైట్, యెల్లో ఫంగస్ లు దాడి చేస్తున్నాయి. దేశంలో అంటువ్యాధులకు కారణం అపరిశుభ్రత అన్నది ప్రజలు తెలుసుకునేలా చేయడంలో పాలకులు విఫలం అవుతున్నారు. పట్టణాల్లో సైతం అపరిశుభ్రత పెరుగుతున్నది. ముందుగా కరోనాను కంట్రోల్ చేయాలంటే ప్రతి దేశమూ తమ జనాభాలో కనీసం పది శాతం మందికి అయినా టీకాలు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోన్ అధనోమ్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశాలన్నీ వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐరాస హెల్త్ ఏజెన్సీ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ టెడ్రోన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ వంటి పెద్ద దేశాలు సహా మరెన్నో పేద దేశాలు టీకాల కొరతతో అల్లాడిపోతున్నాయి. డిమాండుకు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో మరణాలు పెద్ద ఎత్తున సంభవిస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్ల ఉత్పత్తిని త్వరిత గతిన పెంచడంతోపాటు అవకాశం ఉన్న చోటి నుంచి టీకాలను దిగుమతి చేసుకోవాలని భారత్ వంటి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్టు సెప్టెంబరు గడువు నాటికి 10శాతం జనాభాకు టీకాలు ఇవ్వడం సాధ్యమే. లేదంటే మాత్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఎలా అన్నదే సందేహాస్పదంగా ఉంది. దేశంలో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ అభాసు పాలయ్యింది. ఉత్పత్తి పెంచాలని ఆయా రాష్ట్రాల సిఎంలు కేంద్రాన్ని కోరుతున్నాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగన్, వైట్ ఫంగన్ రూపంలో మరో ప్రమాదం వెన్నాడుతోంది. ఫంగన్ బారినపడినవారు ప్రారంభంలోనే దాన్ని గుర్తించకపోతే.. ప్రాణాలే పోతున్నాయి. ఈ రెండు ఫంగను జనాలను భయభ్రాంతలకు గురి చేస్తుండగా.. తాజాగా యెల్లో ఫంగన్ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తుంది. బ్లాక్, వైట్ ఫంగన్ లకన్నా ఇది మరింత ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో తొలిసారి ఈ యెల్లో ఫంగన్ కేసును వైద్యులు గుర్తించారు. బద్దకం, ఆకలి తక్కువగా ఉండటం.. లేదా అనలు ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం యెల్లో ఫంగల్ లో ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఫంగన్ తీవ్రమైతే చీము కారడం, శరీరం మీద ఉన్న గాయాలు, లోపలి గాయాలు నెమ్మదిగా మానడం, పోషకాహార లోపం, అవయవాలు వైఫల్యం చెందడం, చివరికి నెక్రోసిన్ కారణంగా కళ్ళు పోవడం జరుగుతుంది అంటున్నారు వైద్యులు. యెల్లో ఫంగన్ ఒక ప్రాణాంతక వ్యాధి.. ఎందుకంటే ఇది అంతర్గతంగా మొదలవుతుంది. అందువల్ల పైన చెప్పిన ఏదైనా లక్షణాలను గమనించిన వెంటనే వైద్య చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్యులు. యెల్లో ఫంగన్ ఇన్ఫెక్షన్ ప్రధానంగా అపరి శుభ్ర వాతావరణం వల్ల వ్యాప్తిస్తుంది. కనుక ఇంటిని.. చుట్టుపక్కల పరిసరాలను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. బ్యాక్టీరియా, ఫంగన్ పెరుగుదలను నివారించడానికి మిగిలిపోయిన ఆహారాలు, మల పదార్థాలను వీలైనంత త్వరగా తొలగించుకోవాలన్నారు. ఇంటిలోని తేమ కూడా బ్యాక్టీరియా, ఫంగన్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంటిని సాధ్యమైనంత పొడిగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. కోవిడ్ రెండో దశలో పెరుగుతున్న మరణాలతో జనం బెంబేలెత్తుతుంటే, ఇప్పుడు బ్లాక్ ఫంగన్ భయాందోళనలు సృష్టిస్తోంది. కోవిడ్ నుంచి బయటపడిన వారిలో కొందరు బ్లాకఫంగన్ బారిన పడుతున్నారు. అయితే బ్లాక్ ఫంగన్ వాయు,జల సంబంధిత అంటువ్యాధి కాదు. ఈ విషయంలో భయపడాల్సిన పనిలేదు. కళ్లు, మెదడుపై ప్రభావితం చేసే ఫంగన్ ఇది. కోవిడ్ కు గురై ఎక్కువ కాలం స్టెరాయిడ్స్ వాడిన వారు, చక్కెర వ్యాధి అదుపులో లేనివారు, ఎక్కువ కాలం ఆక్సిజన్ పై వైద్యం తీసుకున్న వారి బ్లాక్ ఫంగన్ బారినపడే అవకాశముంది. కోవిడ్ బాధితులు ఆక్సిజన్ పై వైద్యం పొందే క్రమంలో స్టెరిలైజర్ వాటర్ కాకుండా, సాధారణ నీరు ఉపయోగించడం వల్ల ఫంగన్ రావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. కోవిడ్ నియంత్రణకు ఎక్కువగా స్టెరాయిడ్స్, మితిమీరిన యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. స్టెరాయిడ్స్ వాడకంతో శరీరంలో సుగర్ నియంత్రణ అదుపు తప్పుతుంది. ఆక్సీకరణ, ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో, ఫంగన్ రావడానికి అవకాశం కలుగుతుంది. కోవిడ్ నియంత్రణకు ఇప్పుడున్న వైద్యవిధానంలో స్టెరాయిడ్స్ వాడడం తప్పనిసరైంది. అయితే, కోవిడ్ వచ్చిన వెంటనే స్టెరాయిడ్స్ వాడకూడదు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా స్టెరాయిడ్స్ వినియోగిం చకూడదు. అవసరం లేకున్నా ముందు జాగ్రత్తగా ఎక్కువ కాలం ఆక్సిజన్ తీసుకోకూడదు. రోగి ఆరోగ్య స్థితిని బట్టి వైద్యులు సూచించిన ప్రకారం రోగి మందులు వాడాలి. ఎక్కువ స్టెరాయిడ్స్ వినియోగించడం వల్ల సైనిన్ పై ఫంగన్ ప్రభావం చూపుతుంది. బ్లాక్ ఫంగన్ బారిన పడకుండా షుగర్, ఐరన్, సిఆర్పి స్థాయిలను తెలుసుకొని నియంత్రణలో ఉంచుకోవాలి. ఇకపోతే కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడేందుకు మనకు అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు ఆస్టాజెనెకా అభివృద్ధి పరిచిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కొవార్షన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇలా ఒకదానికొకటి చిక్కుముడుల్లా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు పరిశుభ్రంగా ఉండడం, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మాత్రమే మనం ప్రస్తుత పరిస్థితులను జయించగలం.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి