- ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
ఖమ్మం, జులై 18(జనవిజయం):
బిజేపి ప్రజావ్యతిరేక విధానాలకు దేశభక్తియుత ప్రత్యామ్నాయం ఏర్పడాలసిన అవసరం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణా కన్వినర్ డా.దిడ్డి సుధాకర్ అన్నారు. మంగళవారం స్థానిక శ్రీనగర్ కాలనీలోని ఆఫ్ కార్యాలయంలో జరిగిన ఖమ్మం పార్లమెంటు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పై అణచివేత ధోరణిలో వ్యవహరిస్తున్న బిజేపికి బుద్దిచెప్పాలసిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. అందులో బాగంగానే ఆప్ ప్రతిపక్ష ప్రంటులో భాగస్వామ్యం అయ్యిందని అన్నారు. ఆప్ పదిఏళ్ళలోనే నేషనల్ పార్టీ గుర్తింపు లభించడం, కేజ్రీవాల్ ప్రత్యామ్నాయంగా మారడం సహించలేని మోదీ తప్పుడు కేసులు పెట్టి, నీచమైన పనికి పూనుకున్నాడని దుయ్యబట్టారు.ఈ దేశంలో వనరులను ప్రజలకోసం వినియోగించే నైపుణ్యం ఆఫ్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు.కేంద్రంలో బిజేపి, రాష్ట్రం లోబీఆర్యస్ అవినీతి కి పాల్పడుతూ ప్రజలసొమ్ము దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.182బిసీ ల్లోకేవలం 9బిసి కులాలకు బిసి లబందు అరకొరగా అందించి మభ్య పెడుతుందని ఆరోపించారు .దళితబంద్ కమీషన్ల మయం అయిందని అన్నారు.నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ ఇవ్వకపోవడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని అన్నారు.ఆమ్ఆద్మీపార్టీని బలోపేతం చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధంగా మండల,భూత్ కమిటీ లు వేసుకోవాలని కోరారు.ఆఫ్ తెలంగాణా కోర్కమిటీ సభ్యులు, జిల్లా కన్వీనర్ నల్లమోతు తిరుమల రావు అధ్యక్షత వహించిన ఈసభలో కార్యదర్శి స్వర్ణ సుబ్బారావు,సివైయస్ యస్ రాష్ట్ర అధ్యక్షుడు మాలోత్ సురేష్ బాబు, రాష్ట్ర ఆటోవర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రుద్రాక్ష మల్లేష్,ఆఫ్ యూత్ వింగ్ ఉపాధ్యక్షులు బాబూలాల్ పవార్, రాంబాబు, మైనార్టీ సెల్ అధ్యక్షులు అహ్మద్ తదితరులు ప్రసంగించారు. ఖమ్మం పార్లమెంటు పరిదిలో అసెంబ్లీ ఇన్చార్జి లనియామకం : ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో అసెంబ్లీ ఇన్చార్జి లను కన్వీనర్ డా.దిడ్డిసుదాకర్, కోర్కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు నియామక పత్రాలు అందజేశారు.అశ్వారావుపేట(యస్టీ) నియోజకవర్గం ఇన్చార్జి గా చరఫా పాపారావు దొర, కొత్తగూడెం ఇన్చార్జి లుగా వి.రాంబాబు, గండపనేని సతీష్ లను, మదిరయస్సీనియోజకవర్గం ఇన్చార్జి గా గంధం పుల్లయ్య, పాలేరు జనరల్ ఇన్చార్జి గా పసుమర్తి శ్రీనివాస్, ఖమ్మం అసెంబ్లీ ఇన్చార్జి గా యండి.గఫూర్,కో-ఇన్చార్జిగా చల్లా కల్పన,వైరా అసెంబ్లీ ఇన్చార్జి గా బాబూలాల్ పవార్,కొ-ఇన్చార్జిగా లక్మణ్ నాయక్ లను నియమించారు,ఆయా నియోజకవర్గాల కునియామక పత్రాలు అందజేశారు.