జనవిజయంజాతీయండిమాండ్ మేరకు రెమ్‌డెసివిర్ కేటాయింపు

డిమాండ్ మేరకు రెమ్‌డెసివిర్ కేటాయింపు

న్యూఢిల్లీ, మే 16 (జనవిజయం): ప్రతి రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని, దాని తగినంత లభ్యతను నిర్ధారిస్తూ, దేశవ్యాప్తంగా, ఈనెల 23 వరకు చేసిన కేటాయింపుల వివరాలను కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డి.వి. సదానంద గౌడ ప్రకటించారు. రెమ్‌డెసివిర్ మొత్తం ఉత్పత్తి, కేటాయింపులు గణనీయంగా పెరిగాయని ఆయన తెలియజేశారు.

2021 ఏప్రిల్ 21వ తేదీ నుండి మే 16వ తేదీ వరకు రెమ్‌డెసివిర్ ఔషధ కేటాయింపు ప్రణాళికను తెలియజేస్తూ 2021 మే 7వ తేదీన జారీ చేసిన డీవోకు కొనసాగింపుగా 2021 ఏప్రిల్ 21వ తేదీ నుండి మే 23వ తేదీ వరకు చెల్లుబాటు అయ్యే విధంగా, కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా సవరించిన తాజా కేటాయింపు ప్రణాళిక ను రూపొందించినట్లు, కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో తెలియజేసింది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం ఈ కేటాయింపులు జరిగాయి. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో న్యాయమైన వినియోగానికి అనుగుణంగా పంపిణీ సముచితంగా, సరైనా విధానంలో జరిగేలా పర్యవేక్షించాలని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం కోరినట్లు మంత్రి సదానంద తెలిపారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఇప్పటికే, మార్కెటింగ్ సంస్థలకు కొనుగోలు ఆర్డర్లు జారీ చేయని పక్షంలో ఆయా కంపెనీలకు చెందిన సంబంధిత అధికారులతో సన్నిహిత సమన్వయంతో సరఫరా వ్యవస్థకు అనుగుణంగా, తమకు కేటాయించిన వాటి నుండి కొనుగోలు చేయాలనుకునే పరిమాణం కోసం, వెంటనే తగిన కొనుగోలు ఆర్డర్లు జారీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రైవేటు పంపిణీ విధానంతో కూడా సమన్వయం చేసుకోవచ్చు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి