
భద్రాచలం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఘనంగా డి.సి.డి.పి ప్రోగ్రాం
జనవిజయం, 29 సెప్టెంబర్(భద్రాచలం):
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం 29న భద్రాచలం హెడ్ పోస్టుఆఫీస్ ఆవరణంలో పోస్ట్‌మాస్టర్ బి. రామ్ మోహన్ రావు నేతృత్వంలో భద్రాచలం వద్ద డి.సి.డి.పి (డార్క్ కమ్యూనిటీ డేవలపమెంట్ ప్రోగ్రాం )విజయవంతంగా పూర్తయింది. ముఖ్య అతిదులు గా హాజరైన పాకాల దుర్గా ప్రసాద్ , సేవ్ భద్రాద్రి ఫౌండేషన్ చైర్మన్ మరియు ఐ.టి.సి.& పి.ఎస్.పి.డి కాంట్రాక్టర్, శ్రీ. వి సుచేందర్ , ఏ.ఎస్.పి భద్రాచలం సబ్ డివిజన్ & రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ .జి.నాగేశ్వర రావు , జీయర్ మఠం అధ్యక్షులు వెంక టాచారి మరియు హెడ్ పోస్టిఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల వద్దకే పోస్ట్ ఆఫీస్ సేవలు అనే నినాదం తో పోస్ట్ ఆఫీస్ పని చేస్తుంది అని చెపుతూ ఏ.ఎస్.పి . వ. సుచ్చేందర్ మరియు రిటైర్డ్ పోస్టుమాస్టర్ నాగేశ్వర రావు పోస్ట్ ఆఫీస్ పథకాలు గురించి తెలియచేసారు. పాకాల దుర్గ ప్రసాద్ కూడా పోస్ట్ ఆఫీస్ యొక్క సేవలను కొనియాడారు. జీయర్మఠం అధ్యక్షులు వెంకటా చారీ,సిబ్బంది, ప్రసాద రెడ్డి, నాగ సురేష్,సామంతు, రమేష్ నాయక్, దుర్గా ప్రసాద్, సుధీర్,కస్టమర్‌ల మరియు ఆధార్ కస్టమర్‌లు అందరూ పాల్గొన్నారు.