Saturday, February 24, 2024
Homeరాజకీయందక్షిణాది నుంచి ఎదిగిన తొలి తెలుగు ప్రధాని

దక్షిణాది నుంచి ఎదిగిన తొలి తెలుగు ప్రధాని

  • భూసంస్కరణలతో ఇందిరను ఆకట్టుకున్న మేధావి

హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జనవిజయం):

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్టాన్రికి తెలంగాణ నుంచి ఎంపికైన తొలి ముఖ్యమంత్రిగా తెలుగుజాతి అంతా సగర్వంగా చెప్పుకునేలా దక్షిణ భారతదేశం నుంచే ప్రధాని పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి వ్యక్తిగా పీవీ నరసింహారావు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం పొందారు. ఒక్క రాజకీయ రంగమే కాదు, సాహిత్యంలోనూ ఆయన సృజన ఎంతో గొప్పది.. కవిగా, కథకునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాద రచయితగా, విమర్శకునిగా ఆయన విశ్వరూపం బహుముఖం. పద్దెనిమిది భాషలలో ఆయన పాండితీ ప్రకర్శ కలిగినవారు. అర్థశాస్త్రంలో ఎంత పట్టుందో, ఆధ్యాత్మిక విషయాలలోనూ అంతే పట్టుంది. ఈ శతాబ్ది దేశ చరిత్రలో ఇంతటి విశిష్ట విలక్షణ, బహుముఖ ప్రతిభాశాలి  పీవీ ఒక్కరే. మనజాతి గౌరవాన్ని,ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పిన తెలంగాణ విలక్షణ నేత దివంగత పివి నరసింహారవు. పీవీ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. సామాన్యుడు మాన్యునిగా ఎదగడం అన్నది పివికి మాత్రమే దక్కిన అరుదైన అదృష్టంగా చూడాలి. పీవీ రాజకీయ ప్రస్థానం 1952 జనరల్‌ ఎలక్షన్లతో మొదలైంది. అలా 1962లో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో తొలిసారి న్యాయశాఖ, జైళ్లు, సమాచారశాఖ మంత్రిగా చేరి తన సంస్కరణల పర్వానికి తెరదీశారు. తదుపరి దేవాదాయ శాఖ  వైద్య ఆరోగ్య శాఖ, విద్యామంత్రిత్వ శాఖలను సమర్థంగా నిర్వహించారు. పీయూసీకి బదులు మళ్లీ ఇంటర్మీడియట్‌ను తెలుగు విూడియంతో ప్రవేశపెట్టడమే కాదు, తెలుగు అకాడమికి రూపకల్పన చేసారు.

1969లో ప్రత్యేక తెలంగాణ రాష్టోద్య్రమ సెగవల్ల కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, 1971లో పీవీ ముఖ్యమంత్రిగా నియుక్తులయ్యారు. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో పీవీ భారీ మెజారిటీ సాధించి భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టి విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అయితే తెలంగాణలోని భూస్వాములకు పీవీ సంస్కరణలు నచ్చక, ఆయనకు వ్యతిరేకంగా కేంద్రంలో హై కమాండ్‌ను కలిసి, పీవీ వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని ప్రచారం చేశారు.  అయితే భూ సంస్కరణలు ఆవశ్యకతను సోదాహరణంగా వివరించి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని మెప్పించారు. 1970లో ఆంధప్రదేశ్‌ హైకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లుతాయని ఇచ్చిన తీర్పును, 1972 ఫిబ్రవరి 4న హైకోర్టు ధర్మాసనం రద్దు చేయటంతో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం మొదలైంది. అది రాను రాను పీవీ వ్యతిరేక ఉద్యమంగా మారటంతో 1973 జనవరి 17న పీవీ ప్రభుత్వం రాజీనామా చేసింది. దాంతో పీవీ శకం ముగిసిందని, పీవీ వ్యతిరేక వర్గం సంతోషించింది. భూ సంస్కరణల చట్టం తెచ్చి పీవీ ముఖ్యమంత్రిగా విఫలమయ్యాడని చాలామంది ప్రచారం చేశారు.  ఆంధ్రోద్యమం వల్లనే పీవీ రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం రాష్ట్రపతి పాలనే విధించారుగానీ పీవీ బదులు వేరే ముఖ్యమంత్రిని నియమించలేదు. కాని వారి సంతోషం ఎంతో కాలం నిలువలేదు. పీవీ వంటి మేధావి సేవలు రాష్ట్రస్థాయి కన్న అఖిల భారత స్థాయిలోనే అవసరమని భావించి, ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనతో  పీవీని రాజకీయంగా దూరం చేయడానికి కొందరు అవకాశంగా వాడుకోవాలనుకున్నారు. నట్వర్‌సింగ్‌, అర్జున్‌సింగ్‌, ఎన్డీ తివారీ ప్రభృతులు ఇందులో ఉన్నారు.  పీవీతో రాజీనామా చేయించడానికి వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తానికి ఐదేండ్ల కాలంలో పీవీ దేశానికి సుస్థిర ప్రభుత్వాన్ని, పాలనను ఇచ్చారు. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠను ఇనుమడిరప చేశారు.మహరాష్ట్రలో ఉండగా గోపాల కృష్ణ గోఖలె ప్రభృతుల ఉపన్యాసాలు, మహారాష్ట్రలో వీరసావర్కర్‌ ప్రబోధాలు అక్కడి సంస్కృతి పీవీ జీవిత లక్ష్యాన్ని స్వాతంత్యోద్యమ్రం వైపు మరల్చాయి. ఆ సమయంలో మరాఠి కన్నడ భాషల్లో పట్టుసాధించిన పీవీ హరినారాయణ్‌ ఆప్టె రచనలు, సంత్‌ తుకారాం అభంగాలు చదివి అనువాదాలకు ఉపక్రమించారు. బీఎస్సీ యూనివర్సిటీ ఫస్ట్‌గా నిలిచిన పీవీ నాగపూర్‌ యూనివర్సిటీలో లా చదివి, న్యాయవిద్యలోనూ సర్వోన్నత శ్రేణి సాధించారు. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం పీవీ ప్రతిభను ప్రశంసించి, జుడిషియల్‌ సర్వీస్‌లో చేరాలని ఆహ్వానించగా తిరస్కరించి, హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభల నిర్మాతలలో ప్రముఖంగా పేర్కొనదగిన బూర్గుల రామకృష్ణారావు వ్యక్తిత్వం పీవీని ఆకర్షించింది. ఆయన వద్ద జూనియర్‌గా చేరి న్యాయవాద వృత్తిని కొంతకాలం కొనసాగించారు. స్వామి రామానంద తీర్థ పిలుపునందుకొని వకాలత్‌ వృత్తికి స్వస్తి చెప్పి హైదరాబాద్‌ రాష్ట్ర స్వాతంత్య సమరంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments