జనవిజయంతెలంగాణదళితులకు లేని భూమి అమ్మకాలకెలా వస్తోంది?

దళితులకు లేని భూమి అమ్మకాలకెలా వస్తోంది?

  • వెంటనే అఖిల పక్షం ఏర్పాటు చేయాలి  
  • భూముల అమ్మకం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి
  • నకిలీ విత్తనాలు అమ్మినవారిపై ఎన్ని పి.డి యాక్టులు పెట్టారు?

హైదరాబాద్,జూన్12(జనవిజయం): తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకం నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలు రోజుకో విమర్శ చేస్తున్నారు. నిన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భూములకు సంరక్షులుగా ఉండాల్సిన ప్రభుత్వం ఆదాయం కోసం వాటిని అమ్మేయడమేంటని దీనిపై ప్రజాపోరాటంతో పాటు, న్యాయ పోరాటం కూడా చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా నేడు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడతు ఈ విషయంపై వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. భూముల అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దళితులకు ఇంటికి 3 ఎకరాలు భూమి ఇస్తామని మోసగించిన కేసీయార్ వారికి ఇవ్వడానికి లేని భూమి అమ్మకాలకు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సీడ్ బౌల్ అని ఘనంగా ప్రకటించుకున్నవారికి రాష్ట్రంలో కత్తీ విత్తనాల అమ్మకాలు పతాకస్థాయికి చేరడం కానరావడం లేదా? అని ప్రభాకర్ ప్రశ్నించారు. ఏడేళ్లలో నకిలీ విత్తనాల దళారులను పట్టుకొని శిక్షించిన దాఖలాలు లేవు అని చెప్పారు. 600 కేసులు నమోదైతే 25 మందిపై కూడా పీడీ యాక్టు పెట్టలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పాలనలో కేసీయార్ అన్ని విధాలుగా వైఫల్యం చెందారని విమర్శించారు.

 

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి