జనవిజయంఆరోగ్యండాక్టర్లు కాదు.. , కనీసం మనుషులు.. , కాదు కాదు.. , బ్రోకర్లు.. బోగం వెధవలు.....

డాక్టర్లు కాదు.. , కనీసం మనుషులు.. , కాదు కాదు.. , బ్రోకర్లు.. బోగం వెధవలు.. మీరంతా!

డాక్టర్ల దోపిడీపై సాటి డాక్టర్ ఆవేదన ఇది. నిజమే పరిస్థితులు చూస్తుంటే ఈ రఘురాముడి ఆవేదనలో ఎంత అర్ధముందో అవగతమౌతోంది. మల్లిక్ పరచూరి గారి ఫేస్బుక్ వాల్ నుండి ఎంబెడెడ్ కోడ్ కాపీ ద్వారా ఈ వీడియోను జనవిజయం పాఠకుల కోసం ఇక్కడ ఉంచుతున్నాము. అందరికీ ఆరోగ్యం అసాధ్యమా అని జనవిజయం చేస్తున్న ప్రయత్నంలో ఈ వీడియోలో ఈ డాక్టర్ (ఆయన నిజంగా రఘురాముడే) ఆవేదన పరిస్థితిని తెలియజేస్తోంది. జనాల శవాల మీద డబ్బులు ఏరుకునే కొందరు డాక్టర్ల వైఖరి, కార్పోరేట్ వైద్య వ్యవస్థలోని దొపిడీని తెలిపే పరిస్థితికి చలించే కొందరు మనసున్న డాక్టర్ల మనోవేదనకు కూడా ఈ వీడియో అద్దం పడుతుంది. నిజానికి చాలా మంది మంచి డాక్టర్లు ఈ ఘోరపరిస్థితులలో మానసికంగా నరకయాతన అనుభవిస్తున్నారు. అలాంటి మంచి వైద్యులను ఏకం చేసి పీపుల్స్ మెడికల్ అసోషియేషన్ ఏర్పాటు చేయాలి. ప్రపంచ వ్యాపితంగా ప్రజారోగ్య వ్యవస్థని నెలకొల్పాలని జనవిజయం కోరుకుంటోంది. అలాంటి పరిస్థితి నేటి కోర్పోరేట్ శక్తుల కోరల్లో , కనుసన్నల్లో బ్రతుకీడుస్తున్న పాలకుల, మీడియా, సో కాల్డ్ మేధావుల సపోర్టు ఉన్నంత కాలం, ప్రజలలో చైతన్యం పెరగనంత కాలం, ప్రజలు పౌరులుగా కాక ఓటర్లుగా చూడబడుతున్నంత కాలం ఇది చాలా కష్టంతో కూడుకున్న పనే ….. కానీ అసాధ్యం…. ఈ స్థితే శాశ్వతం కానీ కాదు. కాకూడదు. ఈ స్థితిని రూపుమాపడంలో…. ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న శక్తులకు ఇలాంటి మంచి డాక్టర్లకు ప్రజలంతా అండగా ఉండాల్సిన సమయమిది. ఈ వీడియో ఉంటుందో….. బ్యాన్ చేస్తారో తెలీదు కానీ ఓ డాక్టర్ పేరు రఘురామ. ఆయన ఆవేదనను క్రింద వ్రాస్తున్నాను.

ఈరోజు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. రాష్ట్ర వ్యాపితంగానూ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎక్కడా బెడ్లు దొరకని పరిస్థితి, ఆక్సిజన్ లేని పరిస్థితి,  మందులు దొరకని పరిస్థితి. దీని చుట్టూతా పెద్ద పెద్ద వ్యాపారాలూ. నేను చాలా సిగ్గుతో చెపుతున్నాను. అసహ్యమనిపిస్తోంది. హాస్పిటల్స్ ఈ రకంగా ఒక ఉపద్రవం వచ్చినపుడు ఇంత దారుణంగా జనాల్ని ఎక్ష్ప్లాయిడ్ చేస్తారా? ఇదేంటిది? అంటే ఒక యాక్సిడెంట్ జరిగినపుడు మెడలో చచ్చిపోయిన శవాల మీద గొలుసులు లాక్కుని పోతారు కొంతమందిరి. వాళ్లకినూ ఈరోజు ఉన్న ఈ హాస్పటల్స్ కి … ఈ పెద్ద…. సో కాల్డ్ పెద్దమనుషులు వీళ్లందరూ మళ్లా… వీళ్ళందరికీ పద్మ అవార్డులు కూడా ఇస్తారు. ఇలాంటి బ్రో బో బోగస్ వెధవలకి, బ్రోకర్ వెధవలకి. ఏంటిది? దీనికన్నా ఏమన్నా కంపెనీలు నడుపుకోమనండి ఒక్కొక్క ఫ్లోర్ లో. కనీసం అలాంటి అలాంటి తప్పుడు పనులు చేసుకునే, బోగం పనులు చేసుకునే వాళ్ళన్నా కూడా ఊరు మొత్తం సుఖంగా ఉండాలి, అందరి దగ్గర డబ్బులుండాలి, బాగుండాలి నా బిజినెస్ బాగుంటుందని కోరుకుంటారు. అంతేగానీ ఇట్లా జనాలందరు చచ్చి ఊరు వల్లకాడై పోతున్నా కూడా ఎదవ వ్యాపారాల గురించి, ఎధవ సంతోషపడిపడుతున్నారు. కొంతమందైతే డాక్టర్లని చెపుతున్నాను… మీరు కనీసం డాక్టర్లని చెప్పుకోడానికి కాదు కదా కనీసం మనుషులు.. మనుషులని చెప్పుకోవడానికి కూడా మీకు అర్హత పోయింది. మానవత్వం పూర్తిగా సచ్చిపోయింది. సచ్చిపోయింది. ఈ డబ్బులు పోగేసుకుని జనాల శవాల మీద డబ్బులేరుకుని ఏం బాగుపడతారు? నాశనమైపోతారు…

ఇది వింటుంటే….. ఈ పాండమిక్ సిట్యుయేషన్ లో డాక్టర్ల హీనత్వం చూస్తుంటే (మంచి డాక్టర్లకు, ప్రజాహితం కోరుకునే ప్రజావైద్యులకు మినహాయింపు) మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో వ్రాసుకున్న కవితలో వాక్యాలు….. దొంగ లంజకొడుకులసలే మెసలే ఈ ధూర్తలోకంలో నిలబడజాలక…. వాక్యాలు గుర్తుకువస్తున్నాయి. కానీ…. మనం నిలబడాలి. జనం కలబడాలి. ఈ దోపిడీ వ్యవస్థనూ, మన అవస్థలనూ తొలగించుకునేందుకు కలసి నడవాలి.

  • Palla Kondala Rao

 

 

ప్రజారోగ్యం కోరుకునే వారందరికీ షేర్ చేయగలరు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి