భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి పువ్వాడ
భద్రాచలం జూలై 21(జనవిజయం):
భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు.
ఆలయ ఈ.ఓ రమాదేవి అధ్వర్యంలో అర్చకులు, ఆలయ అధికారులు మంత్రి పువ్వాడను ఆలయ సంప్రదాయాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. గోదావరి వరదల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రార్థించారు.
అనంతరం స్వామి వారి జ్ఞాపిక, లడ్డు ప్రసాదంను మంత్రి పువ్వాడ కు అందచేశారు.