జనవిజయంతెలంగాణభగీరధ పనులు త్వరగా పూర్తి చేయాలి - ఖమ్మం నగర పాలక కమీషనర్ అనురాగ్ జయంతి

భగీరధ పనులు త్వరగా పూర్తి చేయాలి – ఖమ్మం నగర పాలక కమీషనర్ అనురాగ్ జయంతి

ఖమ్మం, మే21(జనవిజయం) : ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో శుక్రవారం ఉదయం నగర కమిషనర్ అనురాగ్ జయంతి పర్యటించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ, శానిటేషన్ సమస్యలపై డివిజన్లలో ఉన్న శానిటేషన్, మిషన్ భగీరథ  పనులను  కమీషనర్ పరిశీలించారు. మిషన్ భగీరథ పనుల సమస్యలు ఎక్కువగా ఉన్న 18,19,20,21,49,53,58 డివిజన్లలో  పనులు త్వరితగతిన చేయాలని కోరారు. మిషన్ భగీరథ వాటర్ ను ప్రజలకు త్వరగా అందించాలనీ మిషన్ భగీరథ సంబంధిత అధికారులకు సూచించారు. కోవిడ్ ప్రబలకుండా  తగు చర్యలు చేపట్టాలని  నగరంలో అన్ని డివిజన్లలో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేయాలని తెలిపారు. కరోనా  మహమ్మారి బారిన పడకుండా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ, పలు జాగ్రత్తలు తీసుకోవాలని  శానిటేషన్ ఇన్స్పెక్టర్ లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ తో పాటు మిషన్ భగీరథ ఏ.ఈ లు,  డీ.ఈలు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు.
దహన సంస్కారాలు బల్లేపల్లిలోనే చేయాలి!
ఖమ్మం నగరంలో కోవిడ్-19 వలన మరణించిన వారి మృతదేహాములను బల్లెపల్లిలోని వైకుంఠధామము నందు మాత్రమే దహన సంస్కారములు చేయాలని ఖమ్మం నగర కార్పోరేషన్ తరపున శుక్రవారంనాడొక ప్రకటన విడుదల చేశారు. ఇతర వైకుంఠధామములో ఎక్కడ కూడా దహన సంస్కారములు చేయరాదని, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కొరకు ఈ నిర్ణయము తీసుకొనైనదిగా తెలిపారు. ప్రజలకు ఈ విషయము పై సహకరించగలరని కోరుతూ కోవిడ్-19 తో మరణించిన వారి దహన సంస్కరణ విషయములో ఇతర వివరములకు నగర పాలక సంస్థకు చెందిన వారిని గాని / +91 6281948876 ను సంప్రదించాలని కోరారు.
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి