జనవిజయంఆరోగ్యంబ్లాక్ ఫంగస్‌పై సీఎస్ సమీక్ష

బ్లాక్ ఫంగస్‌పై సీఎస్ సమీక్ష

హైదరాబాద్, మే 19 (జనవిజయం): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆయుష్ వైద్యులతో బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు అనుబంధంగా మందులు వినియోగించడంపై బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని ప్రధాన కార్యదర్శి అన్నారు. ఈ వ్యాధికి గాంధీ ఆసుపత్రి, ప్రభుత్వ ఇ.ఎన్.టి. ఆసుపత్రి కింగ్ కోఠిలలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్య పద్ధతులలో లభించే చికిత్స విధానాలను గురించి ఆయుష్ వైద్యులు ప్రధాన కార్యదర్శికి ఈ సందర్భంగా వివరించారు. బ్లాక్ ఫంగస్‌కు చికిత్స ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రి, రామంతపూర్‌లోని హోమియోపతి ఆసుపత్రి, చార్మినార్, ఎర్రగడ్డలోని యునాని ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శికి తెలిపారు. ఆయుష్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న చికిత్సపై ఎప్పటికప్పుడు కరపత్రాలు, ప్రెస్ బ్రీఫింగ్‌ల ద్వారా పేషంట్లకు అవగాహన కల్పించాలని ప్రధాన కార్యదర్శి ఆయుష్ వైద్యులకు సూచించారు. ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, తెలంగాణ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ ఎం.జ్యోతి, ఆయుష్ విభాగం డైరెక్టర్ డా.అలగు వర్షిణి, ఆరోగ్య శాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ గంగాధర్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీకాంత్ బాబు, హోమియోపతి డాక్టర్లు డాక్టర్ లింగా రాజు, డాక్టర్ పి. నవీన్, ప్రొఫెసర్ కె.రజని చందర్, ప్రొఫెసర్ సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి , ఆయుర్వేద డాక్టర్లు డాక్టర్ సురేష్ జఖోటియా, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ శైలేష్ నాథ్ సక్సేనా, యునాని డాక్టర్లు ప్రొఫెసర్ బొఖారీ, ప్రొఫెసర్ సలావుద్దీన్, డాక్టర్ ఎం.హెచ్. కజ్మి, డాక్టర్ మిన్హాజుద్దీన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి