CPM నుండి చీమలమర్రి మురళి బహిష్కరణ
భద్రాచలం, జూలై 22 (జనవిజయం):
సిపియం చర్ల మండల కవిుటి సభ్యుడు చీమలమర్ర మురళిని పార్టీ నుండి బహిష్కరించినట్లు కార్యదర్శి కారం నరేష్ ప్రకటించారు. ఈరోజునుండి సిపియం పార్టీకి మురళికి ఎటువంటి సంబందంలేదని ఆయన తెలిపారు. సీపీఎం మండల కమిటీ సమావేశం మచ్చా రామారావు అధ్యక్షత న శనివారం సీపీఎం కార్యాలయంలో జరిగినట్లు తెలిపారు. పార్టీని మెాసం చేసి స్వప్రయెాజనాలకోసం కాంగ్రేస్ లో చేరుతున్న వారి మాటలు నమ్మవద్దని ఆయన తెలిపారు. మురళితో పాటు రామకృష్ణ (rk) శివ, కొత్తపల్లి శ్రీను లను కూడా బహిష్కిస్తున్నట్లు నరేశ్ తెలిపారు. వీరంతా గత కొంతకాలం నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని తెలిపారు. అవకాశవాదంతో పార్టీకి నష్టం చేయటం ద్వారా వ్యక్తిగా లాభాలు పొందవచ్చుగాని సమాజానికి ,ప్రజలకు పార్టీకి ఉపయెాగం వుండదని సిపియం పే ర్కొన్నది. ఈ సమావేశం లో మండల కమిటీ సభ్యులు బోళ్ళ వినోద్, బందేల చంటి, పొడుపుగంటి సమ్మక్క, నాగమణి తదితులు పాల్గొన్నారు.
నమ్మిన సిద్దాంతం కోసం నిబద్దతతో పనిచేసా :
సీపీఎం బహిష్కృత నేత మురళి తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్దత తో ఇన్నాళ్లు పనిచేసినట్లు సీపీఎం బహిష్కృత నేత మురళి వొక ప్రకటన లో పేర్కొన్నారు. తాను ఏనాడు పార్టీకి నష్టం కలిగించలేదని తెలిపారు. పార్టీలోని వ్యక్తుల విధానాలు నచ్చకనే బయటకు వచ్చానని, తనపై తప్పుడు ఆరోపనలు మానుకోవలని అన్నారు. గత కొంత కాలంగా పార్టీలోని వ్యక్తుల పొకడలు నచ్చకనే రెండేళ్లుగా పార్టీలో అంటిముట్టనట్లు వ్వహరించానని మురళి తెలిపారు.