జనవిజయంతెలంగాణకరోనాతో సీపీఎం కార్యకర్త అడపాల కొండల రావు మృతి

కరోనాతో సీపీఎం కార్యకర్త అడపాల కొండల రావు మృతి

బోనకల్,జూన్12(జనవిజయం): ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం(ఎల్) గ్రామానికీ చెందిన సీపీఎం  కార్యకర్త అడపాల. కొండలరావు గత 20రోజులుగా కరోనాతో పోరాడుతూ శనివారంనాడు మృతి చెందారు. కాగా కొండలరావు తల్లి ఆరురోజుల క్రితం మరణించారు. ఒకే వారంలో కుటుంబం లో ఇద్దరు చనిపోవటం వల్ల వారి బంధువులు కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. కొండలరావు వయసు 45 సంవత్సరాలు కాగా.. భార్య, కుమారుడు (18), కూతురు (20) ఉన్నారు. వీరికి గత సంవత్సరం వివాహం చేశారు. కొండలరావు మృతి గ్రామంలో సీపీఎం పార్టీ కి, వారి కుటుంభానికి తీరని లోటని సీపీఎం పార్టీ నాయకులు తెలిపారు. కొండలరావు మృతికి సంతాపం తెలిపిన వారిలో ఎక్స్.ఎంపీపీ, జెడ్పీటీసీ కొమ్ము.శ్రీనివాసరావు, పార్టీ జనరల్ సెక్రెటరీ ఉమ్మినేని.రవి, వైస్ ప్రెసిడెంట్ కారాంగుల.చంద్రయ్య, సొసైటీ ఛైర్మన్ మాదినేని వీరభద్ర రావు, తమ్మారపు లక్ష్మణ్ రావు, పొన్నం రాంబాబు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, పసుపులేటి హనుమంతరావు, వెంకటి, ఇరుగు కాంతారావు, ఏసుపోగు ప్రకాశం, కొమ్ము వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. కొండలరావుకు నివాళులు అర్పించి జోహార్లు తెలియజేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి