
బిజెపి ఎంఐఎం లను సంతృప్తి పరుస్తున్న కేసీఆర్
చరిత్ర ను వక్రీకిస్తున్న బిజెపి
సెప్టెంబర్ 17 ను తెలంగాణ విద్రోహ దినమే!
…సిపిఐ (ఎమ్మెల్ ) ప్రజాపంథా పోటు రంగారావు విమర్శ…..
ఖమ్మం, 17 సెప్టెంబర్(జనవిజయం): పటేల్ సైన్యం తెలంగాణాలో కమ్యూనిస్ట్లను వేటాడిందన్నారు. మూడువేల గ్రామాలలో ప్రజారాజ్యాన్ని,పదివేల ఎకరాలను పేదలు పంపిణీ చేసుకుని,ఎట్టి దోపిడీ లేని గ్రామ స్వరాజ్యాన్ని ధ్వంసం చేసిన రోజు సెప్టెంబర్ 17 అని,”సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విద్రోహ దినమే అని సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి రంగారావు అన్నారు. ఖమ్మంలో ఆదివారం స్థానిక రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విద్రోహదినం సభలో ఆయన ముఖ్యఅతిదిగా పాల్గొని ప్రసంగిస్తూ.,కమ్యూనిస్టు గెరిల్లా పోరాటం ఉన్నత దశకు చేరిన సందర్భంలో, తెలంగాణాలో ఫ్యూడల్ నిజాం రజాకార్లు ఓటమి దశలో వున్న పరిస్థితిలో,జమీందార్లు పల్లెలను విడిచి పట్టణాలకు పారిపోయిన నేపధ్యంలో, నిజాం ప్రభువుతో రాజీ చేసుకొని,నెహ్రూ, పటేల్ సైన్యం తెలంగాణాపై మిలిటరీ యాక్షన్ జరిపిందన్నారు . నిజాం 3 రోజులలో లొంగిపోయి ఒప్పందం చేసుకుని, నజరానాలు, రాజ్ ప్రముఖ బిరుదు అందుకున్నాడన్నారు.3000 మంది గెరిల్లా పోరాట యోధులనూ, కష్టజీవులనూ పొట్టన పెట్టుకుందన్నారు . లక్షలాది ప్రజలను దారుణ హింసలకు గురి చేసిందన్నారు . కమూనిస్టులు పంచిన లక్షలాది ఎకరాల భూమిని తిరిగి భూస్వాములకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నదన్నారు . పారిపోయిన ఫ్యూడల్ జమీందార్లను తిరిగి పల్లెలలోకి తీసుకు వచ్చిందన్నారు . ప్రజలు సాధించుకున్న విజయాలను, స్వేచ్ఛను ధ్వంసం చేసిందన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన సెప్టెంబర్ 17 ను మత దృష్టి కోణాలు చూస్తున్న బిజెపి చరిత్రను వక్రీకరిస్తుందని,నిజాం నవాబు ముస్లిం అయినా 90 శాతం దేశముఖ్ లు, పటేల్,పట్వారీలు హిందువులేనని ఆయన అన్నారు. బిజెపి,ఎంఐఎంలను సంతృప్తి పరచడం కోసం కేసీఆర్ పిల్లి మొగ్గలు వేస్తున్నారని తప్ప, చరిత్రను ..చ్చరిత్ర దృష్టితో చూడట్లేదని ఆయన విమర్శించారు.
తెలంగాణాలో కమ్యూనిస్ట్ల పట్టును ధ్వంసం చేయడం, ప్రజల పోరాటాన్ని, కమ్యూనిస్ట్ల సాయుధ పోరాటాన్ని నెత్తురు టేరుల్లో ముంచడం,1948 సెప్టెంబర్ 17 పటేల్ పోలీస్ యాక్షన్ అసలు లక్ష్యమన్నారు.అందుకే సెప్టెంబర్ 17 తెలంగాణా సాయుధ పోరాటానికి, ప్రజల విజయాలకు విద్రోహం జరిగిన రోజన్నారు.ముమ్మాటికీ అది నిజాం, పటేల్, నెహ్రూ సైన్యం కూడబలుక్కుని విద్రోహం జరిపిన రోజును విద్రోహ దినంగా పాటించాలన్నారు.
సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు, గ్రామ గ్రామాన కుల నిర్మూలన చైతన్యాన్ని పెంపొందించేందుకు, మహాత్మ జ్యోతిబా ఫూలే స్థాపించిన సత్యశోధన సమాజ్ ఆవిర్భావ కార్యక్రమంలో భాగంగా,కుల నిర్మూలన చైతన్య పెంపునకు గ్రామ గ్రామాన సమావేశాలు జరపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుర్రం ఆచ్చయ్య ఆవుల వెంకటేశ్వర్లు, జి రామయ్య, సి వై పుల్లయ్య, కె అర్జున్ రావు, ఆవుల అశోక్, టీ ఝాన్సీలక్ష్మి ,మంగతాయి ప్రసంగించగా కే శ్రీను,చందు, వెంకటేష్, ఆజాద్,సత్తార్, కొమరయ్య, నరసింహారావు, లక్ష్మి,స్వాతి, విజయలక్ష్మి,గంగా, జాస్మిన్, తదితరులు పాల్గొన్నారు