జనవిజయంతెలంగాణకోవిడ్ వల్ల బిలియనీర్స్ జాబితాలోకి ఫార్మా కంపెనీలు - తమ్మినేని

కోవిడ్ వల్ల బిలియనీర్స్ జాబితాలోకి ఫార్మా కంపెనీలు – తమ్మినేని

  • కోవిడ్ లోనూ కోట్లకు పడగలు – పెట్టుబడిదారి వర్గాల విపరీత దోపిడీ
  • బిలియనీర్స్ జాబితాలో ఫార్మా యాజమాన్యాలు – కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
  • బీవీకే ఐసోలేషన్ కేంద్రానికి సుబంధ ఫౌండేషన్ సమకూర్చిన అంబులెన్స్ ఆవిష్కరణ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఖమ్మం, జూన్ 2(జనవిజయం): ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి అండగా నిలవడం శుభ పరిణామమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ స్వచ్చంద సంస్థల చేయూతలో వెయ్యోవంతు ప్రభుత్వాలు అందించినా ప్రపంచానికి ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. కోవిడ్ సమయంలోనూ కొందరి ఆస్తులు కోట్లకు పడగలెత్తడం పెట్టుబడిదారి వ్యవస్థ దోపిడీకి నిదర్శనమన్నారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న కోవిడ్ ఐసోలేషన్ సెంటర్కు సుబంధ ఫౌండేషన్ సమకూర్చిన అంబులెన్ను స్థానిక సుందరయ్యభవన్లో తమ్మినేని బుధవారం ఆవిష్కరించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల మంది ప్రజలు ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇటువంటి సమయంలోనూ పెట్టుబడిదారి వర్గాలు విపరీతంగా దోచుకుంటున్నాయన్నారు. కోవిడ్ ఆధారంగా ఆస్తులు రూ.కోట్లకు పడగెత్తుతున్నాయని తెలిపారు. ఇటీవల ప్రకటించిన బిలియనీర్స్ జాబితాలో కొత్తగా ఫార్మా కంపెనీల యజమానులకు చోటుదక్కడం గమనార్హం అని తెలిపారు. ఈ స్వచ్చంద సంస్థల చిత్తశుద్దిలో వేయ్యోవంతు ప్రభుత్వాలు ప్రదర్శించినా ఈ రోజు కరోనా మహమ్మారి ఉండేది కాదన్నారు. దేశవ్యాప్తంగా 50 సంస్థలకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటే కేవలం ఒకటి, రెండు కంపెనీలకు మాత్రమే అనుమతులివ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దేశంలోని కనీసం వంద కోట్ల మందికి అత్యవసరంగా వ్యాక్సిన్ ఇస్తేనే కరోనా మహమ్మారిని పారదోలగలుగుతామన్నారు. ప్రపంచవ్యాప్తంగా సైనన్ను నమ్ముకుని దూరదృష్టితో వ్యవహరించిన ప్రభుత్వాలు కరోనాను పారదోలడంలో సక్సెస్ అయ్యాయన్నారు. ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్ల నిర్వహణ తీరుపై నమ్మకం లేకే ప్రజలు స్వచ్చంద సంస్థల ఐసోలేషన్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. దోపిడీ పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేయడం, కోవిడ్ వార్డులను మూసివేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. దీనివల్ల వేలాదిమంది కరోనా బాధితులు వైద్యానికి దూరమయ్యే ప్రమాదముందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులన్నింటినీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని వైద్య సేవలందించడమే దీనికి పరిష్కారమని తెలిపారు. కర్ణాటకలోని 75శాతం బెను ప్రభుత్వ కంట్రోల్ లోకి తీసుకుందన్నారు. కేరళలో ఊరికో సూపర్ స్పెషాలిటీ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీవీకే ఐసోలేషన్ సెంటర్ నిర్వహణకు సహకరిస్తున్న స్వచ్చంద సంస్థల నిర్వాహకులకు తమ్మినేని పేరు పేరున అభినందనలు తెలిపారు.

సుబంధ ఫౌండేషను ప్రత్యేక అభినందనలు

బీవీకే ఐసోలేషన్ కేంద్రానికి రూ. 11లక్షల విలువైన అంబులెన్సను సమకూర్చిన సుబంధ ఫౌండేషన్ ప్రధాన బాధ్యులు సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్ సోదరుడు బండి వెంకటేశ్వర్లు కుమారుడు బండి సందీప్, బండి రమేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మల కుమార్తె బండి రచన, తిరుమలాయపాలెం మండలం ఏలువారిగూడెం గ్రామానికి చెందిన దేవరం వెంకటరెడ్డి కుమారుడు భార్గవ్, వేమూరి సుదీర్, రామకృష్ణ, బాలాజీలకు తమ్మినేని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సుబంధ బాధ్యులు అందించిన తాళంచెవితో తమ్మినేని అంబులెన్సను స్టార్ట్ చేశారు. బీవీకే వైస్ చైర్మన్ పోతినేని సుదర్శన్ జెండా ఊపడంతో ముందుకు కదలించారు. టీవీ చౌదరి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు లెనిన్ సమకూర్చిన స్పైరో మీటరూ తమ్మినేని ఆవిష్కరించారు. బీవీకే చైర్మన్ యెనిగండ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీవీకే ప్రపధాన కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఐసోలేషన్ సెంటర్ ఇన్చార్జి పొన్నం వెంకటేశ్వర్లు, బీవీకే సభ్యులు మాచర్ల భారతి, భూక్యా వీరభద్రం, సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, ఎం.సుబ్బారావు, ఎస్ఆర్ఎ ఫౌండేషన్ బాధ్యులు బయ్యన బాబురావు, ఎస్ఆర్ఎ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వై.వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సుబంధ బండి సందీప్ మామ చింతనిప్పు వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, నాగేశ్వరరావు, సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుధాకర్, చేతన ఫౌండేషన్ అధ్యక్షులు పసుమర్తి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి