జనవిజయంఆరోగ్యంకోవిడ్ సేవల్లో ఖమ్మం ఆసుపత్రి టాప్ - మంత్రి పువ్వాడ

కోవిడ్ సేవల్లో ఖమ్మం ఆసుపత్రి టాప్ – మంత్రి పువ్వాడ

  • తెలంగాణలో మొదటి పిల్లల కోవిడ్ సంరక్షణ వార్డు ప్రారంభం
  • మూడో దశలో పిల్లలపై ప్రభావం నేపథ్యంలో ముందు జాగ్రత్తలు
  • 40 పడకలతో పిల్లలకోసం ప్రత్యేక వార్డు పేదవారికి మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం
  • అసలేమీ లేని స్థితి నుండి 300 ఆక్సిజన్ బెడ్స్ కు పెరిగిన సామర్ధ్యం

ఖమ్మం, మే26(జనవిజయం) : కోవిడ్ వైద్య సేవల్లో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని అగ్రస్థానంలో నిలబెట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి చిన్న పిల్లల కోవిడ్ సంరక్షణ ప్రత్యేక వార్డును ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లింగాల కమలరాజుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 3వ దశలో చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా చిన్న – పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ ప్రత్యేక వార్డును 40 పడకలతో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో మౌళిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి తెలిపారు.

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని 550 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసుకున్నామని, గత 2016 సంవత్సరంలో ఆక్సిజన్ బెడ్స్ అసలు లేవని ప్రస్తుతం 3 వందల ఆక్సిజన్ బెడ్స్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఆదేవిధంగా గతంలో వెంటిలేటర్లు కూడా ఏమియూ లేపని ప్రస్తుతం 35 వెంటిలేటర్లు, 5 హెచ్.ఎఫ్.ఎన్.సిలు, 10 సి.పి.ఏ.పిలు, 30 మల్టీ పారా మీటర్లు, 10 కార్డియాలజీ యూనిట్స్, 10 నెప్రాలజీ యూనిట్స్, 13 కె.ఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను నెల కొల్పుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం జరిగిందని మంత్రి తెలిపారు. కరోనా కట్టడిలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉందని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసామని, జిల్లా ఆసుపత్రితో పాటు సత్తుపల్లి, మధిర, పెసుబల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఆక్సిజన్ బెడ్స్, రెమిడెసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. జిల్లాలో కోవిడ్ పాజిటీవ్ రేటు తగ్గుముఖం పడుతుందని రెండు విడతలుగా చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా ఇప్పటికే – 8 లక్షల గృహాల సర్వే పూర్తి చేసుకున్నామని, రోగ లక్షణాలు కలిగిన వారికి సత్వర చికిత్స అందించడంవల్ల ప్రజలను కోవిడ్ నుండి ఉపశమనం కల్గించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడం జరిగిందని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్ల నిల్వ ఉన్నాయని మంత్రి తెలిపారు. విదేశాలలోని ఖమ్మం జిల్లా నివాసితులు ఆక్సిజన్ కాన్ సెన్ ట్రేటర్లను అందిస్తున్నారని వాటిలో ప్రభుత్వ ఆసుపత్రులలో వినియోగించడంతో పాటు పేషెంట్లకు ఇంటి దగ్గర అవసరమున్న వారికి కూడా ప్రభుత్వ పరంగా అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కూడా ప్రభుత్వ రంగ వైద్య సేవలు సులభతరంగా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసారని మంత్రి తెలిపారు. కోవిడ్ వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రయివేటు ఆసుపత్రులలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కొన్ని ప్రయివేటు ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడం జరిగిందని అట్టి ప్రయివేటు హాస్పిటల్స్ సేవాదృక్పదంతో ప్రజలకు వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించన ప్రయివేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యుల ముందస్తు ఆలోచన మేరకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 40 పడకలతో చిన్న పిల్లల ప్రత్యేక కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. జిల్లాలో చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా 10 సంవత్సరాలలోపు 2 వందల మంది చిన్న పిల్లలకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారికి చికిత్స అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా మొదటి సారిగా మన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకున్న చిన్న పిల్లల ప్రత్యేక కోవిడ్ వార్డులో ఆక్సిజన్ సపోర్టు, ఐ.సి.యు సపోర్టు వైద్య సేవలతో పాటు పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాటు చేసామని, చిన్న పిల్లల కోవిడ్ వార్డులలో బెడకు ఆక్సిజన్ కాన్ సెన్ ట్రేటర్ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని, చిన్న పిల్లల్లో కోవిడ్ నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలతో సంసిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. నగరమేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లింగాల కమలరాజు, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగర డిప్యూటీ మేయర్ ఫాతీమా జోహార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఆర్.ఎం.ఓ డాక్టర్ బి.శ్రీనివాసరావు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి