జనవిజయంజాతీయంకోవిడ్ సవాళ్ల మధ్యే టన్నెల డ్రైవ్ పూర్తి

కోవిడ్ సవాళ్ల మధ్యే టన్నెల డ్రైవ్ పూర్తి

కోల్‌కతాలో 800 మీటర్ల మేరకు డ్రైవ్‌ చేపట్టిన రైల్వే

కోల్‌కతా, మే 17 (జనవిజయం): పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని బౌబజార్‌ మార్గంలోని ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్‌లోని ఉర్వి టన్నెల్ బోరింగ్ మెషిన్‌తో (టీబీఎం) టన్నెలింగ్ పనులు నిన్న‌టితో (15.05.2021) పూర్త‌య్యాయి. దీంతో కోల్‌క‌తా ఈస్ట్‌-వెస్ట్ మెట్రో ప్రాజెక్ట్‌లోని మొత్తం టీబీఎం ట‌న్నెలింగ్ ప‌నులు పూర్త‌యిన‌ట్ట‌యింది. శతాబ్దం పైబ‌డిన‌ భవనాలు ఉన్నందున ఈ సొరంగం పనులు చేప‌ట్ట‌డం చాలా కష్టత‌రంగా మారింది. కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ అనుసరించి కోవిడ్ మహమ్మారి విజృభిస్తున్న ప్ర‌స్తుత పరిస్థితుల‌లో 800 మీటర్ల టన్నెల్ డ్రైవ్ విజయవంతంగా పూర్తి చేయ‌డం విశేషం. స‌వాళ్ల‌తో కూడుకున్న ఈ స‌మ‌యంలో సోరంగం పనుల్ని విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌డం విశేషం.

ఇంతకుముందు గ‌త ఏడాది 09.10.2020న ఎస్ప్‌లునేడ్ నుండి సీల్దా వరకు ఈస్ట్ బౌండ్ సొరంగం పూర్తి చేసిన టన్నెల్ బోరింగ్ మెషిన్ 09.01.2021న అవసరమైన పునర్నిర్మాణ, తనిఖీలు చేప‌ట్టిన‌ తరువాత సీల్దా నుండి వెస్ట్ బౌండ్ టన్నెల్‌లో మిగిలిన 800 మీటర్ల సొరంగ పనుల్ని పూర్తి చేయడానికి తిరిగి చ‌ర్య‌ల‌ను ప్రారంభించింది. బౌబజార్ వద్ద రిట్రీవల్ షాఫ్ట్ టన్నెల్ బోరింగ్ మెషిన్ నిన్న (15.05.2021) సొరంగ చేధ‌న‌ను సాధించింది. ఈ టీబీఎమ్ (ఉర్వి) సీల్దా ఫ్లైఓవర్ కింద నుంచి కూడా వెళ్ళింది, దీనికోసం ఫ్లై ఓవర్లో వాహనాల కదలిక భద్రతా కారణాలతో 3 రోజుల పాటు మూసివేసి ఉంది. ఈ టీబీఎం డ్రైవ్ పూర్తయిన తరువాత టన్నెల్ బోరింగ్ మెషిన్ ‘ఉర్వి’తో పాటు నిలిచిపోయిన ఇతర టీబీఎం ‘చండి’ బౌబజార్‌లోని రిట్రీవల్ షాఫ్ట్ నుండి తిరిగి తీసుకొనబడుతుంది. షాఫ్ట్ నీటి బిగుతు, టీబీఎంల‌ ప్రభావిత సొరంగం, మెషిన్‌ను తిరిగి పొందడాన్ని నిర్ధారించిన తరువాత షాఫ్ట్ తవ్వకంలో క్లిష్టమైన కార్యకలాపాలు, ఇత‌ర ప‌నుల‌ను చాలా సురక్షితంగా చేయవలసి ఉంటుంది. అందువల్ల దీనికి సమయం పడుతుంది. మొత్తంగా తవ్వకం పూర్తయిన తరువాత రెండు టీబీఎంల‌ను షాఫ్ట్ నుండి ముక్కలుగా వేరు చేస్తారు. షాఫ్ట్ ప్రాంతానికి ఆర్‌సీసీ ఫ్లోరింగ్, రూఫింగ్ తర్వాత ప‌నులు పూర్తచేయాల్సి ఉంటుంది. భూగర్భ నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడానికి షాఫ్ట్ టాప్ బ్యాక్‌ఫిల్ చేయనున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి