జనవిజయంజాతీయంకోవిడ్ ప్రభావిత పిల్లలకు ‘సంవేదన’

కోవిడ్ ప్రభావిత పిల్లలకు ‘సంవేదన’

న్యఢిల్లీ, మే 18 (జనవిజయం): కోవిడ్-19తో ప్రభావితమైన పిల్లలకు బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ( ఎన్‌సిపిసిఆర్) సంవేదన ( సెన్సిటైజింగ్ యాక్షన్ ఆన్ మెంటల్ హెల్త్త్ త్రూ వెల్నరబిలిటీ త్రూ ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ నేసీసరి ఆక్సిప్టెన్స్ ) ద్వారా టెలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో మానసిక ధైర్యాన్ని అందిస్తోంది. కోవిడ్-19 వల్ల పిల్లలు మానసిక సమస్యలకు గురికాకుండా చూడాలన్న లక్ష్యంతో ఎన్‌సిపిసిఆర్ ఈ సౌకర్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. నిపుణులు/కౌన్సిలర్లు/మనస్తత్వవేత్తలు ఉచితంగా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పిల్లలకు ధైర్యాన్ని కలిగిస్తున్నారు. నిమ్హాన్స్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్) తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ వంటి వివిధ ప్రాంతీయ భాషలలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2020 సెప్టెంబరులో ఈ సౌకర్యం ప్రారంభమయ్యింది. కోవిడ్ సమయంలో సమస్యలను ఎదుర్కొంటున్న పిల్లలకు అండగా నిలబడడానికి నిమ్హాన్స్ ఈ సేవలను ప్రారంభించింది. నిమ్హాన్స్ లోని పిల్లల మరియు కౌమార మనోరోగచికిత్స విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శేఖర్ శేషాద్రి, ఆయన బృంద సభ్యులు వివిధ టెలీ కౌన్సిలింగ్ విధానాల ద్వారా కోవిడ్-19కి సంబంధించిన వివిధ అంశాలపై పిల్లలకు అవగాహన కల్పిస్తూ వారికి మానసికస్థైర్యాన్ని కలిగిస్తోంది.

కోవిడ్-19 వల్ల తమకు ఎదురవుతున్న ఒత్తిడి, ఆందోళన, భయం మరియు ఇతర సమస్యలను టోల్ ఫ్రీ నెంబర్ 1800-121-2830 ద్వారా పిల్లలు తమ మాతృ భాషలో సంవేదన కు వివరించి నిపుణుల సలహాలు సూచనలను పొందవచ్చును. ఈ సౌకర్యం సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది. సమస్యను వివరించి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం పొందాలనుకునే పిల్లలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మూడు తరగతుల్లో కౌన్సిలింగ్ సేవలు పిల్లలకు అందిస్తున్నారు. క్వారంటైన్/ఐసోలేషన్/కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్న పిల్లలు, కోవిడ్ పాజిటివ్ కలిగిన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు, సమీప బంధువులను కలిగి ఉన్న పిల్లలు, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, చట్టం ద్వారా బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సిపిసిఆర్) కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేస్తోంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి