జనవిజయంతెలంగాణకోవిడ్ నియంత్రణపై సమర్ధంగా పోరు

కోవిడ్ నియంత్రణపై సమర్ధంగా పోరు

హైదరాబాద్, మే 19 (జనవిజయం): రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ బీఆర్‌కేఆర్ భవన్‌లో రాష్ట్రంలోని కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరాకై లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ యూనిట్లు, పీఎస్ఏ ప్లాంట్ల నిర్మాణం, క్రయోజినిక్ ట్యాంకర్ల సరఫరా తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం వెంటనే తగు చర్యలను ప్రారంభించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం అవసరమైన పీఎస్ఏ ప్లాంట్లు, సామాగ్రి తదితర అంశాలకు సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.

పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి