జనవిజయంతెలంగాణకోవిడ్‌ నియంత్రణలో భద్రాద్రి జిల్లా తెలంగాణకే ఆదర్శం- మంత్రి పువ్వాడ

కోవిడ్‌ నియంత్రణలో భద్రాద్రి జిల్లా తెలంగాణకే ఆదర్శం- మంత్రి పువ్వాడ

  • కొత్త కాలేజీ ఏర్పాటు జిల్లాకు గర్వకారణం
  • భద్రాచలం ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు

భద్రాద్రి కొత్తగూడెం,మే18(జనవిజయం): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏజేన్సీలోని కొత్తగూడెంలో మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయడం జిల్లాకే గర్వకారణమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం కొత్తగూడెంలో మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేసినందుకు కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్‌ నియంత్రణలో తెలంగాణలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తే ఉమ్మడి జిల్లాకే సంజీవినిగా ఉపయోగపడుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, రెమిడిసివర్‌, ఇంజక్షన్లు, వ్యాక్సిన్లకు ఎలాంటి కోరత లేదని మంత్రి అజయ్‌ కుమార్‌ తెలిపారు. కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సమయంలో వినియోగించే ఆక్సిజన్‌ కష్టాలు తీరిపోయాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న భద్రాచలం ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్‌ కష్టాలు తీర్చేందుకు ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశామన్నారు. దవాఖానలో ఏర్పాటు చేసిన 13వేల కిలో లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ను మంత్రి మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. భద్రాచలంలో ఇప్పటికే దాదాపు 100 సిలిండర్‌ తో కరోనా రోగులకు ఆక్సిజన్‌ ను అందిస్తున్నామని తెలిపారు. నిమిషానికి 300 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ ను తయారు చేసే ఆక్సిజన్‌ జనరేటర్‌ ఇప్పటికే వినియోగంలో ఉంది. దానికి అదనంగా తాజాగా 13వేల కిలో లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్ ఏర్పాటుతో కరోనా బాధితులకు ఆక్సిజన్‌ ను అందించడంతో కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ కష్టాలు ఉండవన్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగులను పరామర్శించి వారికి ఆత్మస్థైర్యం కల్పించారు. అక్కడ అందుతున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కోవిడ్‌ రోగులకు భోజన ప్యాకెట్స్‌ ను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఐటీడీఏ పీవో గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ అనుదీప్‌, డీఎంహెచ్‌వో శిరీష ఉన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి