జనవిజయంతెలంగాణకోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిందిగా పి. హెచ్.సి వైద్యాధికారులను ఆదేశించిన ఖమ్మం కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిందిగా పి. హెచ్.సి వైద్యాధికారులను ఆదేశించిన ఖమ్మం కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

ఖమ్మం, జూన్12 (జనవిజయం) : కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిందిగా పి. హెచ్.సి వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్ ఆదేశించారు. శనివారం కామేపల్లి, ఏన్కూరు, కొనిజర్ల మండలం పెద్దగోపతి, తనికెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి ప్రతిరోజు ఎన్ని నిర్ధారణ పరీక్షలను చేస్తున్నారని, నిర్ధారణ పరీక్షలను పెంచాలన్నారు. ఐసోలేషన్ సెంటర్లో ఉన్న పాజిటివ్ కేసుల వివరాలను, వారికి అందిస్తున్న వైద్య సేవలు, బోజన సదుపాయాలను ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. ఆరోగ్య కేంద్రాలలో సరిపడా టెస్టింగ్ కిట్స్, ఔషధాలు వివరాలను సమీక్షించలన్నారు. ప్రతిరోజు ఇంటింటి సర్వే, ఐసోలేషన్ కిట్స్ పంపిణీ, నిర్ధారణ పరీక్షలు నిర్వహించి కోవిడ ను పూర్తిగా నివారించేందుకు ఏ.ఎస్.ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, రెవెన్యూ, పంచాయితీ అధికారులు సిబ్బంది కృషిచేయాలన్నారు. ఐసోలేషన్లో ఉన్న పాజిటివ్ పేషెంట్లకు మండల అధికారులు భోజనం ఏర్పాట్లు చేయాలన్నారు. పరిసరాలను ప్రతిరోజు పరిశుభ్రంగా ఉండే విధంగా గ్రామ పంచాయితీ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రజల్లో కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భౌతిక దూరం పాటించేలా, తప్పనిసరిగా మాస్టు ధరించేలా, తరచు చేతులు శు భ్రపర్చుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కామేపల్లి మండలం తహశీల్దారు ధారా ప్రసాద్, డాక్టర్ వేముల స్రవంతి, ఎం.పి.డి. ఓ శిలారు సాహేబ్, సర్పంచ్ ఏ.రాందాసనాయక్, ఎస్. హెచ్.ఓ జి.స్రవంతి, ఏన్కూరు మండలం తహశీల్దారు ఖాసీం, ఎం.పి.డి.ఓ అశోక్, డాక్టర్ అల్తాఫ్, సర్పంచ్ వెంకటేశ్వరరావు, ఈ.ఓ. ఆర్.డి సుల్తానా బేగం, కొనిజెర్ల మండలం తహశీల్దారు కృష్ణ, ఎం.పి.డి.ఓ రమాదేవి, పెద్దగోపతి సర్పంచ్ చల్లా రాంమోహన్‌రావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ రమేష్, చంద్రశేఖర్, ఎస్.హెచ్.ఓ మాచినేని రవీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి