జనవిజయంతెలంగాణసరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి కోవిడ్ ఉదృతిని కట్టడి చేయాలి - మంత్రి పువ్వాడ

సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి కోవిడ్ ఉదృతిని కట్టడి చేయాలి – మంత్రి పువ్వాడ

ఖమ్మం,మే24 (జనవిజయం) : జిల్లా సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి గ్రామాలలో కోవిడ్ ఉదృతిని పూర్తిగా కట్టడి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం టి.టి.డి.సి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సమావేశంలో జిల్లా కోవిద్ పరిస్థితులు, ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో వైద్య సేవలు, ఆక్సిజన్, రెమిడెసివర్ లభ్యత, ఇంటింటి జ్వర సర్వే, బ్లాక్ ఫంగస్, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానంగా గ్రామాలలో కరోనా ప్రభలకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయితీరాజ్, వైద్యా ఆరోగ్యశాఖ ప్రతి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో 10 కంటే అధికంగా పాజిటీవ్ కేసులు ఉన్న యెడల అట్టి గ్రామంలో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పేషెంట్లను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.

సత్తుపల్లి, మధిర మండలాలలోని జిల్లా సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, దీనితోపాటు కేసులు అధికంగా నమోదవుతున్న కామేపల్లి, సింగరేణి మండలాల్లో మరింత కట్టడి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామ పంచాయితీతో పాటు ఖమ్మం నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ పరిధిలో కూడా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, స్వీయ ఆరోగ్య రక్షణతో పాటు వారి కుటుంబ ఆరోగ్య పరిరక్షణకై ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్ల సమస్య లేదని ప్రయివేటు ఆసుపత్రులలో కూడా సరిపడా నిలువలు ఉన్నాయని ప్రధానంగా ప్రయివేటు ఆసుపత్రులు ప్రజల నుండి అధిక ఫీజులు వసూలు చేసి ప్రజలను -భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని ఇట్టి చర్యలపై జిల్లా టాస్క్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించి సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్ చికిత్సకు అనుమతి లేకుండా నడుస్తున్న, అనుమతి ఉండి అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడి చర్యలకు పాల్పడుతున్న ప్రయివేటు ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రయివేటు ఆసుపత్రుల దోపిడి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పరిస్థితిని అదుపులోకి తేవాలని ప్రభుత్వ నియమనిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 49 ప్రయివేటు ఆసుపత్రులు విడ్ చికిత్సకు అనుమతి పొందియున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా పరిమితి కంటే అధికంగా బెడ్స్, నీర్జిత ధరలకంటే అధిక రుసు వసూలు చేసే ఆసుపత్రులపై సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 322 బెడ్స్, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 30, పెనుబల్లిలో 20, మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకల కోవిడ్ ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉన్నాయని, స్వల్ప రోగలక్షణాలు కలిగిన వారికి ఆయా ఆసుపత్రులలో చికిత్స అందించి, అత్యవసర వైద్య సేవలు అవసరమున్న వారిని జిల్లా ఆసుపత్రికి పంపించాలని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌలభ్యం అందుబాటులో ఉందని, దీనితో పాటు రెమిడిసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. ఇంటింటి జ్వర సర్వే ద్వారా ఇన్ పే షెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని, లక్షణాలు కలిగిన వారిని ముందస్తుగానే గుర్తించి అవసరమైన ఔషధాల కిట్స్ అందించడం చేత కోవిడ్ ఉధృతిని కట్టడి చేయగలిగామని, రెండవ, మూడవ విడత జ్వర సర్వేను కూడా త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో అధిక కేసులు నమోదవుతున్న మండలాలు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ పంచాయితీలో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని 589 గ్రామ పంచాయితీలకు గాను 10 కంటే అధికంగా పాజిటీవ్ కేసులు నమోదైన గ్రామపంచాయితీలలో _262 ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇట్టి కేంద్రాలలోని పేషెంట్లకు గ్రామ పంచాయితీ నిధుల ద్వారా ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించుటకు ఆదేశించడం జరిగిందని వైద్యాధికారుల నిరంతర పర్యవేక్షణ ద్వారా రోగుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఇంటింటి జ్వర సర్వే వల్ల జిల్లాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఇప్పటి వరకు జిల్లాలో 1485 బృంధాలచేత 1 లక్షా 21 వేల 319 గృహాల సర్వే చేపట్టి రోగలక్షనాలు కలిగిన 12,848 మందిని గుర్తించి 13,279 కిట్సను అందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కోవిడ్ నియంత్రణకు గాను రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం వేచి చూడకుండా లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వైద్యచికిత్సను అందిస్తున్నామని తద్వారా వ్యాధి ఉదృతిని పూర్తిగా నియంత్రించగలుతామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో లా డౌన్ పూర్తిస్థాయిలో పటిష్టంగా అమలు చేస్తున్నామని జిల్లా సరిహద్దు ప్రాంతాలలో నిఘాను మరింత కట్టడి చేయడం జరిగిందని, ఈ-పాసులు కలిగిన అంబులెన్స్, ఇతర వైద్యసేవల వాహనాలను | మాత్రమే అనుమతించడం జరుగుతున్నదని, ఉదయం 10.00 గంటల తర్వాత ఎట్టి పరిస్థితులో అనవసర జనసంచారం లేకుండా లా డౌనను పటిష్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

పోలీసు కమీషనర్ విష్ణు.ఎస్.వారియర్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దు ప్రాంతాలపై నిఘాను పెంచామని, పాస్ లేనటువంటి వాహనాలను ఎట్టి పరిస్థితులలో అనుమతించడం లేదని బెల్టుషాపులపై ప్రత్యేక దృష్టి సారించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామాని సరిహద్దు ప్రాంతాలతో పాటు కేసులు అధికంగా నమోదవుతున్న గ్రామాలలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు సమన్వయంతో మోబైల్ పెట్రోలింగ్ ద్వారా కోవిడ్ నియంత్రణ కట్టడి చర్యలు చేపట్టామని తెలిపారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూధన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతీ, డాక్టర్ శాంతి భద్రతల అడిషనల్ డి.సి.పి సుభాష్ చంద్రబోస్, ఏ.సి.పిలు, సత్యనారాయణ, రామానుజం, వెంకటరెడ్డి, ఆంజనేయులు, ప్రసన్నకుమార్, వెంకటేష్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఐ.ఎం.ఏ కార్యదర్శి కూరపాటి ప్రదీప్, డ్రగ్ ఇన్స్ పెక్టర్ జి.సురేందర్, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, అర్బన్ తహశీల్దారు శైలజ, సంబంధిత అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి