జనవిజయంతెలంగాణమరింత కట్టుదిట్టంగా కోవిడ్ నియంత్రణ చర్యలు : అధికారులకు ఖమ్మం కలెక్టర్ ఆదేశం

మరింత కట్టుదిట్టంగా కోవిడ్ నియంత్రణ చర్యలు : అధికారులకు ఖమ్మం కలెక్టర్ ఆదేశం

ఖమ్మం,మే22(జనవిజయం) : కోవిడ్ నియంత్రణ కట్టడి చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో లాక్ డౌన్ అమలు, డిసెంట్రలైజేషన్ ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు,జిల్లా సరిహద్దు ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు, సూపర్ స్పెడర్స్ ల గుర్తింపు, కోవిడ్ లక్షణాలు కలిగిన వారికి చికిత్స అందించడం తదితర అంశాలపై తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, స్టేషన్‌ హౌజ్ ఆఫీసర్స్, పి.హెచ్.సిల వైద్యాధికారులతో శనివారం జిల్లా కలెక్టర్, పోలీసు కమీషనర్ విష్ణు. ఎస్.వారియర్ తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ కోవిడ్ కట్టడి చర్యలపై దిశా నిర్దేశం చేసారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాబోయో 10 రోజులలో లా డౌనన్ను మరింత పటిష్టంగా అమలు చేయాలని, ప్రధానంగా జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ఉన్న 10 మండలాలలోని 33 గ్రామాలలో ఇతర రాష్ట్రాల నుండి జిల్లాలోకి ప్రవేశించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ కట్టడి నియంత్రణ చర్యల్లో భాగంగా ఆధిక కేసులు నమోదవుతున్న గ్రామ పంచాయితీలలో సత్వరమే డిసెంట్రలైజ్డ్ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి పాజిటీవ్ నిర్ధారణ అయిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని, స్వీయ రక్షణతో పాటు వారి కుటుంబ ఆరోగ్య పరిరక్షణకై ఐసోలేషన్ కేంద్రాలలో ఉండేవిధంగా కుటుంబ సభ్యలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు సంయుక్త సమన్వయంతో గ్రామాలలో కరోనా నియంత్రణ కట్టడి చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో పెనుబల్లి, కల్లూరు, సింగరేణి, కామేపల్లి మండలాల్లో కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని, సంబంధిత మండలస్థాయి బృంధాలు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు, పేషంట్లను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించే విషయంలో స్థానిక సర్పంచ్, పంచాయితీ కార్యదర్శులను భాగస్వామలు చేయాలని, ఎం.పి.డి.ఓలు తమ మండల పరిధిలో పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడంతోపాటు ఐసోలేషన్ కేంద్రాలలో ఉన్నవారికి భోజనం, వసతి సదుపాయాలు కల్పించాలని వైద్యాధికారులు ప్రతిరోజూ ఐసోలేషన్ కేంద్రాలను సందర్శించి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ వైద్యసేవలను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఐసోలేషన్ కేంద్రంలో తప్పనిసరిగా రెండు పల్స్ ఆక్సిజన్ మీటర్లు అందుబాటులో ఉండాలని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన కిట్స్ అందుబాటులో ఉన్నాయని, అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, వైద్యాధికారులు తప్పనిసరిగా పూర్తి రక్షణ చర్యలు పాటించాలని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం వేచి చూడకుండా లక్షణాలు కలిగిన వారికి చికిత్స అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్,జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆసుపత్రులలో నిరుపయోగంగా ఉన్న వేస్టేజ్ ను వెంటనే తరలించి ఆసుపత్రులన్నీ పరిశుభ్రంగా ఉండేలా సత్వర చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మొదటి విడత జ్వర సర్వే పూర్తి చేసుకున్నామని, తద్వారా ఆసుపత్రులలో ఇన్ పేషెంట్ల సంఖ్యను తగ్గించగలిగామని, అదే స్పూర్తితో రెండవ విడత జ్వర సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు. దీనితో పాటు సూపర్ స్పెడర్స్ అయినటువంటి ఆటోరిక్షా డ్రైవర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్, పేపర్‌ బాయ్స్, వీధి వ్యాపారులు, కండక్టర్లతో పాటు నేరుగా ప్రజలతో సంబంధం కలిగి ఉన్న వారిని గుర్తించి వారందరికి వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియను కూడా మొదలు పెట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి 1077 కోవిడ్ కాల్ సెంటర్ గురించి గ్రామ స్థాయిలో ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని, గ్రామాలలో ఏర్పాటు చేసే ప్రతి ఐసోలేషన్ కేంద్రంలో కాల్ సెంటర్ నెంబర్‌ను ప్రదర్శింప చేయాలన్నారు. లాక్ డౌన్ సమయంలో గ్రామాలలో అనవసర జన సంచారాన్ని పూర్తిగా కట్టడి చేయాలని, స్టేషన్ హౌజ్ అధికారులు, తహశీల్దార్లు లాక్ డౌన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలనీ, కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

పోలీసు కమీషనర్ విష్ణు.యస్.వారియర్ మట్లాడుతూ లాక్ డౌనను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రధానంగా జిల్లా సరిహద్దు ప్రాంతాల రహదారులను మూసివేయాలని, చెక్ పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు, తణిఖీలు ఉండాలని మండల స్థాయిలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, తహశీల్దార్ల, ఎం.పి.డి.ఓల సమన్వయంతో లాక్ డౌన్ అమలు చేయాలని సూచించారు. ఉదయం 9.45 గంటలలోపు ప్రజల తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఉదయం 10.00 గంటల తర్వాత అనవసరంగా ఎవరు కూడా బయట తిరగరాదని, గ్రామాలలోమోబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రతి గ్రామాన్ని సందర్శించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గ్రామాలలో ప్రధానంగా బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, బెల్టు షాపుల నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేయాలని పోలీసు కమీషనర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎస్.మదుసూధన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్లర్లు, ఎం.పి.డి.ఓలు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి