జనవిజయంతెలంగాణకోవిడ్ చర్యలలో దేశానికే ఆదర్శం తెలంగాణ-మంత్రి పువ్వాడ

కోవిడ్ చర్యలలో దేశానికే ఆదర్శం తెలంగాణ-మంత్రి పువ్వాడ

ఖమ్మం(మధిర), మే18 (జనవిజయం): కోవిడ్ ఉదృతిని కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులను అదేవిధంగా కిష్టాపురం లోని మహాత్మ జ్యోతి పూలే గురుకుల విద్యాలయం లో ఏర్పాటుచేసిన కోవేడ్ కేర్ సెంటర్ ను మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజులతో కలిసి మంగళవారం సాయంత్రం మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ వైద్య సేవలకు కు గాను ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని పీహెచ్సీలో ఆక్సిజన్ తో కూడిన బెడ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రతి పీహెచ్సీలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని టెస్టింగ్ కిట్స్ తో పాటు అవసరమైన రెమిడెసివర్ ఇంజక్షన్ లను అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలోని ప్రతి పీహెచ్సీల ను ఏరియా ఆస్పత్రులు గా అప్డేట్ చేసే బాధ్యతతో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. స్థానిక శాసనసభ్యులు భట్టి విక్రమార్క సూచించిన విధంగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకలతో ఐసోలేషన్ వార్డులను ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందని వీటిలో పది బెడ్స్ కు ఆక్సిజన్ సదుపాయం సమకూర్చడం జరిగిందన్నారు. రెమిడిసివర్ ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయని మధిర తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు నేరుగా జిల్లా కేంద్రానికి రాకుండా మధిర ప్రభుత్వ ఆసుపత్రిలోనే కోవిడ్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. అదేవిధంగా పాజిటివ్ నిర్ధారణ అయి ఇంట్లో సౌకర్యాలు లేని వారికోసం ప్రత్యేకంగా 100 బెడ్స్ తో గురుకుల పాఠశాలలో ప్రత్యేక కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశామని దీనిలో ఉచిత వైద్య సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని పాజిటివ్ నిర్ధారణ అయి సౌకర్యాలు లేని వారు ఈ కేంద్రంలో ఉచిత వైద్య సేవలు పొందవచ్చని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దీనితోపాటు టి వి ఆర్ మెమోరియల్ పాఠశాలలో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా టీకా కేంద్రాన్ని కూడా ఈ పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా వెంటాడుతున్న సమస్య నివారణకు గాను జిల్లా యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తుందని అయినప్పటికీ వీటి నివారణకు చర్యలు అవసరమని జిల్లా మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన కోరారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారమౌతున్న కోవిడ్ వైద్యాన్ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ, రోగనిర్ధారణ ప్రక్రియ మరింత ప్రణాళికా బద్ధంగా జరగాలని, ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ నియామకాలు చేపట్టాలని, మానవ, ఆర్ధిక వనరులను వినియోగించి కోవిడ్ నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రభుత్వపరంగా చేపట్టాలని ఆయన కోరారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ మధిర ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రత్యేక ద్రుష్టితో కోవిడ్ పేషెంట్ల కొరకు 20 బెడ్స్ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మధిరతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు స్వల్ప చికిత్స, వైద్య సేవలు ఇట్టి ఐసోలేషన్ కేంద్రం ద్వారా పొందవచ్చని సీరియస్ కేసులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. 20 పడకలతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో 10 పడకలకు ఆక్సిజన్ సదుపాయం నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. అదేవిధంగా పాజిటివ్ నిర్ధారణ అయిన వారికోసం ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటరును కూడా అందుబాటులోకి తేవడం జరిగిందని, ఇట్టి కేంద్రం ద్వారా ఉచిత వైద్య, వసతి, భోజన సదుపాయాలు అందించడం జరుగుతుందన్నారు. శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, మధిర మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, ఎం.పి.పి యం.లలిత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి, మధిర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు డాక్టర్ యం.శ్రవణ్ కుమార్, డాక్టర్ పి.మనోరమ, డాక్టర్ పి.శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి