జనవిజయంసినిమాకరోనాతో వర్మ సోదరుడు మృతి

కరోనాతో వర్మ సోదరుడు మృతి

అనారోగ్యంతో డబ్బింగ్ ఆర్టిస్ట్

హైదరాబాద్,మే24(జనవిజయం): చలనచిత్ర రంగానిక చెందిన మరో ఇద్దరు కరోనాకు బలయ్యారు. కరోనా సెకండ్ వేవ్ లో వైరస్ బారినపడి సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది ప్రముఖులు తనువు చాలించారు. – మరికొంతమంది అనారోగ్య కారణాల వల్ల మృతి చెందుతున్నారు. ప్రముఖ సంచలన దర్శకుడ రామ్ గోపాల్ వర్మ ఇంట్లో విషాదం నెలకొంది. కరోనాతో ఆయన సోదరుడు పి. సోమశేఖర్ ఆదివారం కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఆయన కరోనా బారిన పడగా… హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుప్రతితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమశేఖర్ … ఆయన సోదరుడు దర్శకత్వం వహించిన రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టారు. మున్కురాకే ధేఖ్ జరా అనే బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల ఇతర వ్యాపారాలు మొదలు పెట్టడంతో..సినిమా రంగానికి, వర్మకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్, టాలీవుడ్ దిగ్భాంతి వ్యక్తం చేసింది. తాజాగా ప్లేబాక్ సింగర్ గా పేరొందిన ఏవిఎన్‌ మూర్తి కన్నుమూశారు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. పరిస్థితి విషమించి ఆదివారం తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లాకు చెందిన ఏవిఎన్‌ మూర్తి… నేపథ్యగాయకుడిగా అనేక పాటలు ఆలపించారు. ఆయన ప్లేబ్యాక్ సింగర్ గానే కాకుండా.. తెలుగు, తమిళ సినిమాల్లోని ఎంతోమంది ప్రముఖులకు డబ్బింగ్ చెప్పారు. మూర్తి మృతిపై చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈయన వారసత్వం కొనసాగింపుగా.. తన కుమారుడు శ్రీనివాసమూర్తి కూడా డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ప్రముఖ హీరోలైన సూర్య, విక్రమ్, అజిత్, రాజశేఖర్, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కు కూడా శ్రీనివాన్ మూర్తి డబ్బింగ్ చెప్పారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి