జనవిజయంఆరోగ్యంకరోనాతో పరాచికాలు వద్దు !

కరోనాతో పరాచికాలు వద్దు !

  • జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదు
  • థర్డ్ వేవ్ కూడా స్వారీచేసే ప్రమాదం
  • వైద్య నిపుణుల హెచ్చరికలు

న్యూఢిల్లీ, జూన్5 (జనవిజయం): కరోనా తగ్గుముఖం పడుతున్నామరికొంతకాలం పాటు తప్పనిసరిగా నియమనిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తొలిదశలో కరోనా ఖతం అయ్యిందన్న ధీమానే రెండోదశ విజృంభణకు కారణమయ్యింది. మనమంతా ఎంతగా జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరిగితే మూడోదశ కూడా ఉధృతంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మనమంతా కరోనా వలయంలో చిక్కకుని గిలగిల కొట్టుకుంటున్నాం. ఆ వలయం నుంచి బయటపడేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కరోనాతో ఇక పరాచికాలు వద్దని గుర్తించాలి. కరోనా ఏమి చేయదులే అన్న నిర్లక్ష ధోరణిని ఇక వీడాల్సిందే. ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ లెక్కకు మిక్కిలి మరణాలు నమోద వుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యి కొన్ని కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. మొత్తంగా మళ్లీ అన్ని షరా మామూలు అవుతున్న వేళ మనమంతా మరింత అప్రమత్తంగా ఉండకపోతే కరోనా పిలిచి కౌగింలిచుకోవడం  ఖాయం. సడలింపులు ఇచ్చారని, లాక్ డౌన్ సంకెళ్లు తెంచుకున్నామని రంకెలు వేస్తే కరోనాతో కష్టాలు తప్పవు. బయట ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఎవరితో అది సహవాసం చేస్తున్నదో తెలియదు. ఎవరినుంచి ఎవరికి సోకుతున్నదో తెలియడం లేదు. తొలిదశలో కనీసం లక్షణాలు కనిపించేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఎలాంటి లక్షణాలు లేకుండానే ఒకరినుంచి మరోకరికి తీవ్రంగానూ, వేగంగానూ వ్యాప్తి చెందుతోంది. నిర్లక్ష్యంగా ఉన్నవారిని కబళిస్తోంది.

కరోనా వైరన్ మహమ్మారిపై మన దేశం అలుపు ఎరగకుండా పోరు సాగిస్తున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరింతగా పెరుగు తుందని అంచనాలు వస్తున్నాయి. వైరన్ దండయాత్ర మొదలెట్టినప్పుడు వున్న స్థాయిలో ఉన్నదానికన్నా ఇప్పుడు భయాందోళనలు పెరిగాయి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నందున ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎదుటివారితో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎదుటి వారికి కరోనా ఉందన్న భయంతో మసలుకోవాలి. ఎవరైనా తుమ్మినా, దగ్గినా, జ్వరం వుందని చెప్పినా వారినిచూసి హడలెత్తాల్సిందే. కరోనా బాధితులనూ, వ్యాధిగ్రస్తుల కుటుంబాలనూ దూరంపెట్టే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కానీ దాని బారినపడితే మరణం ఖాయమన్న అపోహ ఈ రెండోదశలో పెరిగిపోయింది. మరణాల సంఖ్య విపరీతంగా ఉండడం వల్లే ఇలాంటి భయాలు వస్తున్నాయి. ప్రజలు నిజంగానే భయపడే వారు అయితే జాగ్రత్తలు తీసుకుని ఉంటే వైరన్ విజృంభణ ఆగిపోతుంది. కానీ అలా జరగడం లేదు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నా నేటికీ ఎవరికివారు తమకేమి కాదులే అన్న ధీమాలో ఉంటున్నారు. అలాగే వ్యాధి గురించి వెల్లడిస్తే దోషిగా పరిగణిస్తారన్న భయం కూడా తగ్గింది. వ్యాధి గురించి భయపడ తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది దరిచేరదని అవగాహన ఏర్పడినా పాటించడంలో ఇంకా నిర్లక్ష్యం కానవస్తోంది. ప్రస్తుతానికి మనం కరోనా జాబితాలో ప్రపంచంలో ముందున్నాం. వ్యాధిగ్రస్తుల సంఖ్య, మరణాల సంఖ్య ఎక్కువున్నట్టే అనిపిస్తున్నా ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.

లాక్ డౌన్ సంకెళ్లు దాదాపు మెల్లగా తెగిపోయినట్లే కనిపిస్తున్నాయి. అన్ని వ్యవస్థలు మళ్లీ గాడిన పడుతున్నాయి. కుదేలయిన భారత్ ఆర్థికరంగం మళ్లీ గాడిన పడాలని ప్రభుత్వాలు కూడా చూస్తున్నాయి. అందుకే మెల్లగా నడలింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలు కూడా పనిచేసుకుంటే తప్ప పూటగడవని వారు ఎందరో ఉన్నారు. అందుకే లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం కావాలని కోరుకోవడం లేదు. దీనికితోడు కరోనా భయం ఉన్నా.. ఆకలి భయం చంపేస్తోంది. అందుకే ప్రజలు తమ విధుల్లో చేరేందుకు అనివార్యంగా పరుగెడుతున్నారు. దీంతో రోడ్లన్నీ మళ్లీ బిజీగా ఉన్నాయి. కాలుష్యం మళ్లీ కళ్లకు కనిపిస్తోంది. ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అంటే వైరన్ ఎంతో తీవ్రంగా మనచుట్టూ తచ్చాడుతున్నదని అర్థం చేసుకోవాలి. ప్రజలు ప్రస్తుత వాతావరణాన్ని మననం చేసుకుంటూ మసలుకోక పోతే అది మనచెంతకు రావడానికి ఎంతో దూరం లేదని గ్రహించాలి. ప్రభుత్వాలు ఈ విషయంలో ప్రజల్ని మరింత అప్రమత్తం చేయక తప్పదు. కరోనా విషయంలో కచ్చితంగా తీసుకునే జాగ్రత్తలే ప్రాణహాని నుంచి కాపాడతాయని ప్రజలు గుర్తించి ముందుకు సాగితే తప్ప ప్రమాదం నుంచి తప్పుకోలేం. మాల్స్, గుళ్లూ తెరుచుకుంటున్నాయి కనుక పొలోమని పరుగెత్తకుండా జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వాలిచ్చిన వెసులు బాట్లు ఆసరా చేసుకుని దైనందిన కార్యకలాపాలు మళ్లీ గతంలో లాగానే స్పీడ్ అందుకుంటున్నాయి. వ్యాపార, వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు మెల్లగా ఊపందుకుంటున్నాయి.

అయితే చాలా చోట్ల భౌతిక దూరం పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో భౌతిక దూరం పాటించడం లేదు. కరోనాకు దూరంగా ఉండడంతో పాటు పర్యావరణానికి హాని చేకూర్చే విధానాలకు స్వస్తి చెప్పడం, ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు మానుకోవడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రాధాన్యమివ్వడం ప్రస్తుత అవసరం అన్నది గుర్తించ మసలుకోవాల్సి ఉంది. ఈ విషయంలో ఏమరుపాటు ప్రదర్శిస్తే ముప్పు ఏర్పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరిస్తున్న సంగతిని మరువరాదు. లేకుంటే కరోనా మరణాల సంఖ్య పెరిగే జాబితాలో మన పేరూ ఉంటుందని గుర్తుంచుకోవాలి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి