జనవిజయంఅధ్యయనంకరోనా సంక్షోభంపై అధ్యయనం జరగాలి !

కరోనా సంక్షోభంపై అధ్యయనం జరగాలి !

దేశంలో ఆయా రాష్ట్రాలు ఎవరి పరిధిలో వారు లాక్ డౌన్ కొనసాగిస్తున్న వేళ అనేక రంగాల ప్రజలు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. లక్షలాది మంది ఉద్యోగం, ఉపాధి కోల్పోయారు. వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ఎన్నికల పుణ్యమా అని అనేకులు కరోనాకు బలయ్యారు. టీచర్లు ఎందరో మరణించారు. ఇలా మరణించిన వారి కుటుంబాలపై అధ్యయనం చేసి వారిని అదుకునే ప్రయత్నాలు చేయాలి. గతేడాది ప్రధాని మోడీ ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ ఏయే రంగాలను ఆదుకున్నదీ లేనిదీ తెలియడం లేదు. తాజాగా ఇచ్చిన ఐదుకిలోల బియ్యం సాయం వల్ల కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. అయితే ఈ సంక్షోభంపై అధ్యయనం చేయాలి. గ్రామాల వారీగా లెక్కలు తీయాలి. ఎంతమంది బలయ్యారు.. ఏ ఆనుపత్రిలో మరణించారు.. వారికి ఎంత ఖర్చయ్యిందీ తెలుసుకోవాలి. ఇలా కోల్పోయిన వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాధలయ్యారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు దిక్కులేని వారయ్యారు. ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు కూడా చనిపోయారు. ఇలా చనిపోయిన వారి విషయంలో సమగ్ర సమాచార సేకరణ జరిగి వారికి సాయం అందించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్ఫత్వాలు ముందుకు రావాలి.

ఎందుకంటే అనేక మంది ప్రజలు లక్షల్లో డబ్బులు అప్పుచేసి మరీ ఆస్పత్రులకు ధారపోశారు. అందించిన ప్యాకేజీ వల్ల మేలు జరిగిందా లేదా అన్నది కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ప్రభుత్వానికి విస్తృతమైన యంత్రాంగం ఉన్నందున నివేదికలు తెప్పించుకోవాలి. ఇంటిలిజెన్స్ ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచార సేకరణ చేయాలి. అవసరమైతే దెబ్బతిన్న రంగాలకు సంబంధించి వివరాలు తెప్పించుకుని ముందుకు సాగాలి. అప్పుడే కరోనా కష్టాల వల్ల ప్రజలకు ఉపశమనం దక్కుతుంది. ప్రధానంగా నిత్యకూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. కొన్ని రాష్ట్రాల్లో తగిన చర్యలు తీసుకుని వారిని ఆదుకున్నా.. అవి తక్షణ ఉపశమనం కోసం చేసినవే తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి చేయలేదు. ఇవన్నీ కళ్లకు కనిపిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకున్న ప్రయత్నాలు చేయలేదు. చిత్తశుద్దిగా వ్యవహరించడం లేదు. దేశ పునర్నిర్మాణంలో అతిపెద్ద భాగస్వాములైన ప్రజలను అనాధలుగా వదిలేస్తే భవిష్యత్ నాశనం కాగలదు.

నిజానికి దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ఉపశమన చర్యలు తీసుకుని, సక్రమమైన వైద్యం అందించే ప్రయత్నం చేసివుంటే సమస్యలే ఎదురయ్యేవి కాదు. కనీసం ఇప్పుడైనా కరోనాతో చనిపోయినవారి వెతలపై అందరూ దృష్టి సారించాలి. అలాగే కరోనాతో ఎంతమంది చనిపోయారో కూడా లెక్కలు తీసేందుకు పనికి వస్తుంది. వారి సంక్షేమం కోసం ఏంచేయాలో, ఇప్పుడెదురైన చేదు అనుభవాలు భవిష్యత్తులో ఎదురు కాకూడదనుకుంటే ఎలాంటి చర్యలు చేయడం అవసరమో లోతుగా ఆలోచించాలి. కరోనా వైరన్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజల జీవితాలు దుర్బరమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికలను ముందే గ్రహించి అందుకు వసరమైన ముందస్తు చర్యలు అమలు చేసివుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. సామాన్యుల కష్టాలను విని, చూసి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు రంగంలోకి దిగి చేతనైనంత చేయడంతో కొందరైనా పొట్టనింపుకోగలిగారు. బతికి బట్ట కట్టకలిగారు. అయితే కొందరు నిత్యం అడుక్కుంటే తప్ప పూటగడవని పరిస్థితిలో ఉన్నారు. ఇన్ని అనుభవాల దృష్ట్యా ప్రభుత్వాలు ఆలోచనలు చేయాలి.

ఈ దేశంలో ఉన్న అభివృద్ధికి సామాన్యులే పునాది రాళ్లు. దేశంలోని నమస్థ మౌలిక సదుపాయాలకూ వీరే వెన్నెముక అన్నది కూడా మరవరాదు. మాల్స్, మల్టీప్లెక్స్ లు, అపార్ట్ మెంట్లు, హోటళ్లు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు అన్నీ వీరి శ్రమశక్తితోనే నిర్మాణమయ్యాయి. ఆకాశ హర్మ్యాలకు రంగులద్దినా, గూడ్స్ రైళ్లనూ, ట్రక్కులనూ నరుకులతో నింపినా, రిక్షాలు లాగినా, ఆటోలు నడిపినా, తోపుడు బళ్లపై ఆధారపడినా, ఆహారమో, నరుకులో ఇంటింటికీ అందించినా అంతా వీరి చలవే అన్నది పాలకులు గుర్తించాలి. ఈ పనులు చేసేవారిలో అత్యధికులు దళితులు, ఆదివాసీలే. ప్రభుత్వాలు ప్రణాళిక ప్రకారం సాగివుంటే, అభివృద్ధి పనులకు సంకల్పించి ఉంటే … ఉన్న ఊరును, కన్నవారిని విడిచి, భార్యాబిడ్డల్ని వదిలి వేల కిలోమీటర్ల దూరంలో అనేకులు దినసరి కూలీలు పనిచేస్తున్నారు. ఇలా నగరాలకొస్తున్నవారంతా ఎంతటి దుర్భరమైన స్థితిలో బతుకులీడుస్తున్నారో పరిశీలన చేయాలి.

దేశ సంపద పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న వలన జీవుల్ని ప్రభుత్వాలు పూర్తిగా ఉపేక్షిస్తున్నాయి. చెప్పుకోవడానికి పేదరిక నిర్మూలన పథకాలు దేశంలో చాలానే వున్నా.. అవేవీ దినసరి కూలీలను, కార్మికులను ఆదుకోవడంలేదని నిరూపితం అయ్యింది. కరోనా దెబ్బతో వలన జీవులకు ఇన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేసిందేమీ లేదని వెల్లడైంది. వలన జీవులతో పనులు చేయించుకుంటున్న యజమానుల్లో అత్యధికులు వారికి సంబంధించి ఎలాంటి రికార్డులు నిర్వహించడం లేదు. కార్మికులకు న్యాయంగా దక్కవలసిన పథకాలను ఎగొట్టడం కోసం చాలా తక్కువ మందిని లెక్కల్లో చూపుతారు. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు పక్కన పెట్టాయి. ఈ దశలో ఇక కార్మికులకు ఉపాధి చూపే దిశగా పథకాలు రూపొందించాలి. వారి కుటుంబాలకు బతుకు భయం లేకుండా చూడాలి. అందుకు తగిన ప్రణాళికలను రచించాలి. ఇప్పట్లో కరోనా కష్టాలు తొలగవు కనుక వివరాలు సేకరించడంతో పాటు, ప్రణాళికలు రూపొందించుకోవాలి. దీంతో కరోనా బాధితులకు, చనిపోయిన కుటుంబాలకు మేలు చేసినవారం అవుతాం.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి