జనవిజయంతెలంగాణకరోనా బాధితులకు ఇంటి వద్దకే ఉచిత భోజనం అందిస్తోన్న సిపిఎం

కరోనా బాధితులకు ఇంటి వద్దకే ఉచిత భోజనం అందిస్తోన్న సిపిఎం

  • సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభం
  • దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా

ఖమ్మం, మే22 (జనవిజయం): కరోనా బాధిత కుటుంబాలకు ఇంటి వద్దకే నాణ్యమైన, పౌష్టికాహారాన్ని ఉచితంగా అందిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రకటించారు. ఇంటింటికి ఉచిత భోజన పధకాన్ని ఈ రోజు సిపిఎం జిల్లా కార్యాయలంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబాలకు కుటుంబాలే మొత్తం కరోనా బారినపడి వంట చేసుకోలేని పరిస్థితి దాపురించిందని, భయంతోటి బంధువులు, మిత్రులు కూడా సహాయం చేయలేని స్థితిలో బాధితులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అటువంటి వారికి సహాయం చేయటానికి తమ పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. ఒక ఫోన్ చేస్తే చాలు తమ కార్యకర్తలు ఇంటికి వచ్చి ఆహారం అందిస్తారని చెప్పారు.

ప్రాణాలకు తెగించి ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ముందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులను ఆయన అభినందించారు. ఇప్పటికి బోడేపూడి విజ్ఞాన కేంద్రం(బివికె) ఆధ్వర్యంలో పలు స్వచ్చంద సంస్థల సహకారంతో గత 15 రోజులుగా పూర్తిగా ఉచితంగానే భోజనం, మెడికల్ సర్వీస్, ఔషదాలు, టెస్టులు తదితర సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించటానికి వ్యక్తులు, సంస్థలు సహాయ, సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి రమేష్, నాయకులు వై.శ్రీనివాసరావు, ఎం. రామారావు, డివైఎస్ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్, బషీరుద్దీన్, ఎస్ఎస్ఏ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్, నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, ఇంటూరి అశోక్, ముత్తారావు, వాసిరెడ్డి వీరభద్రం, పోలేపల్లి శరణ్య తదితరులు పాల్గొన్నారు.

సంప్రదించవల్సిన వివరాలు : మధ్యాహ్నం భోజనం కొరకు ఉదయం 9 గంటలకు, రాత్రి భోజనం కొరకు మధ్యాహ్నా 3 గంటల కల్లా ఫోన్ చేసి చెప్పాలి. సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లు : వై.శ్రీనివాసరావు-9573691669, ఎం. రామారావు- 9491923632.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి