జనవిజయంతెలంగాణకరోనా రోగులకు డాక్టర్లచే ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించిన బోడేపూడి విజ్ఞాన కేంద్రం

కరోనా రోగులకు డాక్టర్లచే ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించిన బోడేపూడి విజ్ఞాన కేంద్రం

  • కరోనా రోగులు ధైర్యంగా ఉండాలి – ప్రముఖ వైద్యులు యలమంచిలి రవీంద్రనాథ్
  • కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యం – బండి రమేష్

ఖమ్మం, జూన్ 3 (జనవిజయం) : కరోనా సోకి చికిత్స పొందుతున్న రోగులు ధైర్యంగా ఉండాలని ప్రముఖ వైద్యులు యలమంచిలి రవీంద్రనాధ్ సూచించారు. గురువారం బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ లోని పాజిటివ్ వచ్చిన వారితో ఆన్లైన్ లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాజిటివ్ వచ్చిన వారు మనో ధైర్యాన్ని కోల్పోకూడదని అన్నారు. కరోనా వైరస్ ముక్కు నోరు, కళ్ళ గుండా మాత్రమే మనిషి శరీరంలోకి పోతుందన్నారు. 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలని సూచించారు. కరోనా వ్యాధి వచ్చి నయం అయిన వాళ్ల ద్వారా ఇతరులకు జబ్బు రాదని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఐసోలేషన్ సెంటర్ ఇంచార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ కోవిడ్ పాజిటివ్ వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం అనేక స్వచ్చంద సంస్థల సహకారంతో బివికే ఆధ్వర్యంలో ఐసోలేషన్ సెంటర్ నడుస్తుందని వారన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు తొమ్మిది మంది చేత ఈ సెంటర్లో ఉన్న పేషెంట్లకు వైద్యం అందించబడుతుంది అని అన్నారు. ఆహాదకరమైన వాతావరణంలో పోషకాహారం రోగులకు అందించబడుతుందని తెలిపారు. ఇప్పటికే బివికె ఐసోలేషన్ సెంటర్ నుంచి అనేకమంది పాజిటివ్ వచ్చి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి ఇళ్లకు వెళ్లారు అని గుర్తు చేశారు. సొంత కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో ప్రాణాలు లెక్కచేయకుండా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న వాలంటీర్లను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్. నవీన్ రెడ్డి, రావులపాటి నాగరాజు, సైదారావు వైద్య సిబ్బంది షేక్ నౌషీన్, విజయ తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి