జనవిజయంతెలంగాణకరోనా పేషెంట్‌ల బంధువుకు అన్నం పెట్టడం నేరమా ?

కరోనా పేషెంట్‌ల బంధువుకు అన్నం పెట్టడం నేరమా ?

గాంధీ ఆస్పత్రిలో ఆహారం పంపిణీ చేసిన సీతక్క

హైదరాబాద్‌,మే17(జనవిజయం): పేదలకు, కరోనా పేషెంట్లకు ఆహారం అందించడం కూడా నేరమా? అని ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. ప్రభుత్వం పెట్టదు, ఇతరులను అన్నం పెట్టనివ్వదని మండిపడ్డారు. సోమవారం గాంధీ ఆస్పత్రిని ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా పేషెంట్ల బంధువులకు ఆమె భోజనాలు పంపిణీ చేశారు. అనంతరం సీతక్క విూడియాతో మాట్లాడుతూ నీరు, ఆహారం దొరక్క పేషెంట్ల బంధువులు అవస్థలు పడుతున్నారని వాపోయారు. వారికి భోజనాలు పెడుతున్న ఎంపీ రేవంత్‌రెడ్డిని అడ్డుకుని ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము పెట్టం.. ఇతరులను పెట్టనివ్వం అనడం దుర్మార్గమని సీతక్క ధ్వజమెత్తారు. కరోనా పేషెంట్లను ఆదుకునేందుకు ఎవరికి వారు తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారని అన్నారు. తాము కూడా వారికి అండగా ఉండాలని భోజనాలు అందచేస్తుంటే అభినందించాల్సింది పోయి, విమర్శలు చేయడం, అడ్డుకోవడం దుర్మార్గమని సీతక్క అన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంఅంతర్జాతీయంవ్యవసాయంసాహిత్యంస్పూర్తిప్రముఖులుఆయుర్వేదంపోల్స్విద్యఅధ్యయనంవీడియోలుజర్నలిజంవికాసంపర్యావరణంవినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలుఎన్నికలుతెలుసుకుందాంపిల్లల పెంపకంవిజ్ఞానంనేర వార్తలువార్త-వ్యాఖ్యఆధ్యాత్మికంజీవనంన్యాయంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలువీరమాచనేని డైట్ సలహాలుఎడిటర్ వాయిస్రాజ్యాంగంసమాజంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్కుటుంబంప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి