జనవిజయంఆరోగ్యంపజలు నిర్లక్ష్యం వీడితేనే కరోనా కంట్రోల్‌ సాధ్యం!

పజలు నిర్లక్ష్యం వీడితేనే కరోనా కంట్రోల్‌ సాధ్యం!

  • హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు-పట్టించుకోని ప్రజలు
  • వేవ్ లు పెరుగుతున్నందున కరోనా కష్టాలు మరింతకాలం
  • ప్రభుత్వాలు మరిన్ని కఠిన చర్చలు కొనసాగించాలి
  • లాక్డౌన్ అమలయిన చోట్ల తగ్గుతున్న కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అన్ని దేశాలను మించి భారతదేశం మూల్యం చెల్లించుకుంటోంది. రోజూ వందలాదిమంది మృత్యువాత పడుతున్నా కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడం ద్వారా కట్టుదిట్టం చేయడంలో మోడీ ప్రభుత్వం ఇంకా విూనమేషాలు లెక్కిస్తోంది. దీనికితోడు ప్రజలు కూడా ఉపాధి, ఉద్యోగాల పేరుతో విచ్చలవిడిగా బయట తిరగడంతో కరోనా కట్టడి చర్యలు విఫలం అవుతున్నాయి. ప్రజల నిర్లక్ష్యం మొత్తం సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. తమకు కరోనా ఉన్నదన్న విషయం తెలుసుకునేలోపే వారు వందలాది మందికి అంటిస్తున్నారు. ప్రజలు తమకు తాము లాక్‌డౌన్‌ విధించుకుని స్వీయ రక్షణ పాటించనంత వరకు కంట్రోల్‌ చేయలేమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు కఠినంగా ఇళ్లకే పరిమితం కావాల్సి ఉన్నా కావడం లేదు. ఉపాధి కోసం బయటకు రావడంతో కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. తుఫాన్‌ లేదా, సునావిూ,భూకంపాల వల్ల కలిగే నష్టాలు కొంతమేరకే ఉంటాయి. కొంతకాలం వరకే దాని నష్టప్రభావం ఉంటుంది. కానీ కరోనా ప్రభావం లెక్కించడానికి వీలు లేనంతగా ఉంటోంది. కుటుంబాలు అనాథలు అవుతున్నాయి.

సెకండ్‌వేవ్‌ ప్రభావం నుంచి ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని హెచ్చరికలు వస్తున్నాయి. దీనిప్రభావం ఇప్పట్లో పోతుందన్న నమ్మకం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే హెచ్చరిస్తోంది. ఈ దశలో ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఒక ఎత్తయితే ప్రజలు ఎవరికి వారు తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఉండాలి. లాక్‌డౌన్‌ అనుభవాలతో ప్రజలు వ్యక్తిగత భద్రతను పాటించాలి. లేకుంటే మనతో పాటు సమాజానికి కూడా తీరని నష్టం కలుగుతుందని గుర్తించాలి. అప్పుడు ఇంతకు మించిన విలయం చూడాల్సి వస్తుంది. లాక్డౌన్‌ ఆంక్షలు ఎత్తేసిన సమయంలో ప్రజలు గుంపులుగుంపులుగా బయటకు వస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అలాగే వాహనాలన్నీ రోడ్లపైకి వచ్చాయి. పోలీసులు వీరిని అదుపు చేయడానికి నానా తంటాలు పడుతున్నా ప్రజల్లో మాత్రం కించిత్‌ బాధ కూడా కలగడం లేదు. ప్రజల బాధ్యతారాహిత్యానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. లాక్‌డౌన్‌ విధింపు కారణంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలన్నీ ఆంక్షలు ఎత్తేసే సమయంలో మళ్లీ కిక్కిరిసి పోయాయి. వాహనాలు బయటకు రావడంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ వచ్చినా దానిని ప్రజలకు అందించే కార్యాచరణ లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చూడాలి. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరిస్తేనే దీని వ్యాప్తిని అరికట్టగమని పదేపదే హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు కానరావం లేదు. ఇలా చేస్తూ పోతే మనకు భద్రత లేదని గుర్తించాలి. గతంలోలాగా ఇష్టం వచ్చినట్లుగా రోడ్డెక్కితే కరోనా కబళించక మానదని ఆస్పత్రులకు వెళ్లి చూస్తే తెలుస్తుంది. ఇంకా దాని తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

మరోవైపు భారత్‌ లాంటి దేశాల్లో విచ్చలవిడితనం వల్ల రానున్న రోజుల్లో పరిస్థితి తీవ్రంగా ఉండవచ్చని కూడా అంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కూలీనాలి చేసుకునే పేదలు, దిగువ, మధ్య తరగతి ప్రజలు ఎంతో మంది మరణిస్తున్నారు. భారత్‌లో ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులను ఆదుకునే ప్రయత్నాలు చేయడం లేదు. పదికిలోల బియ్యం ప్రకటించి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. కరోనా వేవ్‌ ఇలాగే కొనసాగితే ఇంకా ఎంతమంది మృత్యువాత పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రజలంతా ఇంట్లో ఉండాలని, క్రమం తప్పకుండా మంచినీళ్లు తగడంతోపాటు శరీరాన్ని చల్లగా ఉంచేందుకు నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, మామిడి పళ్ల రసం తీసుకోవాంటూ ఆరోగ్య సంస్థ అనేక సూచనలు చేసింది. పేదలకు మజ్జిగ, మామిడి పళ్ల గురించి ఆలోచించే ఆస్కారమే లేదు. ఈ దశలో వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలు కరోనా బారిన పడకుండా ఇప్పటివరకు తీసుకున్న చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలి. వైద్యాన్ని ఉచితంగా ఇచ్చి ఆదుకునే ప్రయత్నాలు చేయాలి. దేశ ఐటీ రంగానికి కీలకంగా మారిన చెన్నైలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌ మహానగంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లోనే ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత కఠినంగా ఆంక్షలు విధించి అమలు చేయకపోతే కరోనా వ్యాప్తి తీవ్రం అవుతుందనడంలో సందేహం లేదు. ఈ ప్రాంత ప్రజలు తమకుతాముగా కఠిన ఆంక్షలను అమలు చేసుకుని ముందుకు సాగకపోతే మరింత ప్రమాదంలో పడతామని గుర్తించాలి. దేశ జనాభాలో ఇప్పటివరకు వైరస్‌ బారిన పడినవారి శాతం 1.8 మాత్రమేనని.. ఇంకా 98 శాతంపైగా ప్రజలకు కరోనా ముప్పు పొంచే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే, కొవిడ్‌ 2 శాతం మందికి వ్యాపించే లోగానే కట్టడి చేయగలమని తెలిపింది. 199 జిల్లాల్లో మూడు వారాలుగా కేసులు తగ్గుతున్నట్లు వివరించింది. 22 రాష్ట్రాల్లో పాజిటివ్‌ రేటు 15%గా ఉండటం ఆందోళనకరమేనని లవ్‌ అగర్వాల్‌ అన్నారు. తమిళనాడులో అత్యధికంగా 24%గా ఉందన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి